ETV Bharat / entertainment

విల్లాను అద్దెకు ఇస్తున్న ప్రభాస్.. రెంట్ ఎంతో తెలిస్తే అమ్మో అనాల్సిందే!

author img

By

Published : Jun 22, 2023, 4:56 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాకుండా వ్యాపారాల్లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటలీలో ఆయనకు ఉన్న విల్లాను అద్దెకు ఇచ్చారని సమచారం. మరి ఆ విల్లా నెలవారి ఆద్దె ఎంతంటే..?

Prabhas italy villa rent
ప్రభాస్ ఇటలీ విల్లా

సినిమాల్లో బిజీగా ఉంటూనే వ్యాపారాల్లో రాణిస్తుంటారు మన సినీ తారలు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇందుకు ఏ మాత్రం భిన్నం కాదు. పాన్ ఇండియా స్టార్​గా ఎదిగిన ప్రభాస్.. తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఇటలీలో పెట్టుబడులుగా పెట్టారని తెలిసింది. ఈ క్రమంలో ప్రభాస్​ అక్కడ ఓ లగ్జరీ విల్లాను కూడా కొనుగోలు చేశారట. సినిమా షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడు ప్రభాస్ తన స్నేహితులతో కలసి అక్కడకు వెళ్లి సరదాగా గడుపుతుంటారట. అక్కడి వాతావరణం, లొకేషన్​లను ప్రభాస్ బాగా ఇష్టపడతారట.

అయితే ఇతర ప్రదేశాల్లో షూటింగ్​ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఇటలీలోని విల్లాను ప్రభాస్ అద్దెకు ఇస్తున్నారని సమాచారం. కాగా ఇటీవల ఆ విల్లాను ప్రభాస్​.. విదేశీ టూరిస్ట్​లకు, అక్కడి స్థానికులకు అద్దెకు ఇస్తున్నారట. ఆ విల్లాకు అద్దె రూపంలో నెలకు రూ. 40 లక్షల దాకా వస్తుందని తెలుస్తోంది.

కాగా ప్రభాస్ 'బాహుబలి'​ సినిమాలతో పాన్ ఇండియా స్టార్​గా ఎదిగారు. అప్పటి నుంచి ఆయన సినిమాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలయ్యాయి. సాహో, రాధేశ్యామ్​ సినిమాల ఫలితం ఏదైనా.. కలెక్షన్ల పరంగా మాత్రం ప్రభాస్ మార్క్​ను పెంచాయి. తాజాగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్​తో 'ఆదిపురుష్' పాన్ ఇండియా లెవెల్​లో రూపుదిద్దుకుంది. రామాయణ ఇతిహాసంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలు హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు తలెత్తాయి. సినిమాలో డైలాగులు, కొన్ని సన్నివేశాలు రామ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. వీటిపై స్పందించిన చిత్రబృందం అభ్యంతరకరంగా ఉన్న డైలాగులను తొలగించి రీ ఎడిట్ చేసిన వెర్షన్​ను గరువారం నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్​ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్​తో కలిసి 'సలార్' సినిమా చేస్తున్నారు. కాగా ఈ చిత్రం నుంచి బుధవారం ఓ అప్​డేట్​ వచ్చింది. షూటింగ్​ పనులన్నీ సవ్యంగా సాగితే.. వచ్చే వంద రోజుల్లో సినిమాను విడుదల చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది.

కృతితో రిలేేషన్​.?
టాలీవుడ్​లో మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్​ అనగానే గుర్తుకొచ్చే పేరు ప్రభాస్. ఆదిపురుష్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఆ మధ్య కాలంలో ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్​తో రిలేషన్​లో ఉన్నారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రూమర్స్​ను వారిద్దరూ తిప్పికొట్టారు. కాగా ఇటీవలె తిరుపతిలో జరిగిన 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్​ వేదికపై ప్రభాస్ మాట్లాడుతుండగా.. పెళ్లి ఎప్పుడు అన్నా? అంటూ ఫ్యాన్స్ గోల చేశారు. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. ఎప్పుడైనాగానీ ఇక్కడే (తిరుపతిలో) చేసుకుంటా అని ఆయన సమాధానం ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.