ETV Bharat / entertainment

పవన్​ మూవీ నుంచి పూజా ఔట్​.. ​చరణ్​ కొత్త సినిమా కోసం అనిరుధ్​!

author img

By

Published : Jun 3, 2022, 11:52 AM IST

పవన్​కల్యాణ్​ 'భవదీయుడు భగత్​సింగ్'​ సినిమా నుంచి హీరోయిన్​ పూజాహెగ్డే తప్పుకున్నట్లు తెలిసింది. మరోవైపు రామ్​చరణ్​-గౌతమ్​ తిన్ననూరి మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్​ను ఎంపిక చేసినట్లు సమాచారం.

pooja hegdey anirudh
పూజాహెగ్డే అనిరూధ్​ ​

Poojahegdey Bhavadeeyudu Bhagatsingh: 'రాధేశ్యామ్'​, 'బీస్ట్​', 'ఆచార్య'లతో ఈ ఏడాది వరుస ఫ్లాప్​లు ఎదురైన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు హీరోయిన్​ పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేశ్​బాబు-త్రివిక్రమ్​ మూవీ, హిందీలో సల్మాన్​ఖాన్ 'కభీ ఈద్​ కభీ దివాళీ'​, రణ్​వీర్​ సింగ్ 'సర్కస్'​ చిత్రాల్లో నటిస్తోంది. దీంతోపాటే పవన్​కల్యాణ్​ 'భవదీయుడు భగత్​సింగ్'​లోనూ నటించనున్నట్లు ప్రచారం సాగింది. ప‌లువురు నాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన చిత్ర‌యూనిట్ పూజాహెగ్డేను హీరోయిన్​గా ఖ‌రారు చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ ఈ ప్రాజెక్ట్​ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. హిందీ చిత్రాలతో పాటు మహేశ్​ సినిమాకు ఆమె కంటిన్యూషన్​గా డేట్స్​ కేటాయించిందట! ఈ క్రమంలోనే డేట్స్​ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

Ramcharan Gowtam tinnanuri movie music director: మెగాపవర్​స్టార్​ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈసినిమాప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. దీని తర్వాత చరణ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే అధిరికంగా ప్రకటించిన ఈ చిత్రం.. జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ బజ్​ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీకీ సౌత్​ ఇండియన్ మ్యూజిక్​ సెన్సేషన్​ అనిరుధ్​ను ఎంపిక చేసే ఆలోచనలో మూవీటీమ్​ ఉందట! ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. దాదాపు ఖరారు అయినట్లేనని సినీవర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, డైరెక్టర్​ గౌతమ్‌ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులుదిద్దే పనిలో బిజీగా ఉన్నారు. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు దర్శకుడు గౌతమ్‌ గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇదీ చూడండి: షారుక్​-అట్లీ మూవీ ఫస్ట్​లుక్ వైరల్​.. బాద్​షా గెటప్​​ సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.