ETV Bharat / entertainment

బాక్సాఫీస్​ వద్ద 'పఠాన్​' కలెక్షన్ల వర్షం.. 'బాహుబలి' రికార్డ్​ బ్రేక్​ చేయనుందా?

author img

By

Published : Feb 18, 2023, 10:41 AM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నటించిన 'పఠాన్' సినిమా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. విడుదలై 23 రోజులు అయినా.. వసుళ్లలో జోరు కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా టికెట్ రేట్లను తగ్గించారు. దీంతో ఈ వారం కూడా పఠాన్​ బాక్సాఫీస్​ వద్ద వసూళ్లు రాబడుతుందని ట్రేడ్​ వర్గాల సమాచారం. 'పఠాన్'​ 23 రోజుల కలెక్షన్ల వివరాలు..

Pathaan box office day 23
Pathaan box office day 23 Pathaan box office day 23

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నటించిన 'పఠాన్'​ చిత్రం.. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై 23 రోజులు అవుతున్నా.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జోరు తగ్గలేదు. అయితే ఈ సినిమా టికెట్​ రేట్లను శుక్రవారం తగ్గించారు. దీంతో ఈ మూవీ వసూళ్ల వాన ఇంకా పెరిగే అవకాశముందని ట్రేడ్​ వర్గాల సమాచారం.

'పఠాన్'​ సినిమా నిర్మాణ సంస్థ యశ్​ రాజ్​ ఫిల్మ్స్​ సోషల్​ మీడియా వేదికగా కలెక్షన్ల వివరాలు వెల్లడించింది. ఈ సినిమా 23 రోజుల్లో వరల్డ్​ వైడ్​గా రూ.976 కోట్ల గ్రాస్​ సాధించిందని తెలిపింది. ఇండియాలో రూ.609 కోట్ల గ్రాస్​.. రూ.505 కోట్ల నెట్​ కలెక్షన్లు సాధించిందని పేర్కొంది. అలాగే ఓవర్​సీస్​లో కూడా పఠాన్​ కలెక్షన్లు అదిరిపోయాయి. అక్కడ రూ.367 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్​సీస్​ 'బాహుబలి-2' రూ. 510 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డును పఠాన్​ బద్దలకొట్టనుందో లేదో వేచి చూడాలి.

యశ్​​రాజ్​ ఫిల్మ్స్​ సంస్థ దేశవ్యాప్తంగా టికెట్​ రేట్లను రూ.110కు తగ్గించింది. దీంతో ఈ వారం కూడా 'పఠాన్' కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, కార్తిక్ ఆర్యన్​ నటించిన షెహజాదా, హాలీవుడ్ సినిమాలు యాంట్​ మ్యాన్, వాస్ప్: క్వాంటమ్ విడుదలయ్యాయి. వీటి పోటీని తట్టుకుని కలెక్షన్లు సాధించడానికే యశ్​​ రాజ్​ ఫిల్మ్స్​ టికెట్​ రేట్లు తగ్గించిందని మరో వాదన వినిపిస్తోంది. 'షెహజాదా' మూవీ టీమ్​ 'బై వన్​ గెట్​ వన్​' టికెట్​ ఆఫర్​ను ప్రకటించింది.

కాగా, పఠాన్​ చిత్రం స్త్పై యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందింది. ఈ సినిమాలో షారుక్​ సరసన బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణె ఆడిపాడింది. జాన్​ అబ్రహం కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ గెస్ట్​ రోల్​లో కనువిందు చేశారు. ఇక, ఈ సినిమాకు సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకత్వం వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.