ETV Bharat / entertainment

సీనియర్​ ఎన్టీఆర్​- పవన్​కు ఉన్న కామన్​ క్వాలిటీ​ ఏంటంటే?

author img

By

Published : Sep 7, 2022, 1:35 PM IST

చిత్రపరిశ్రమలో విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న సీనియర్​ ఎన్టీఆర్​-పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​కు మధ్య ఓ కామన్​ క్వాలిటీ ఉందట. అదేంటంటే..

senior ntr pawan
సీనియర్ ఎన్టీఆర్​ పవన్​

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్​పై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. పవన్​ ఆశయం నెరవేరాలని కోరుకున్నారు.

"పవన్‌కల్యాణ్‌ని నేనెంతో ఇష్టపడుతుంటాను. ఇప్పటివరకూ 27 సినిమాలు మాత్రమే చేశాడు. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక పార్టీలో ఉండి.. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచన వేరు.. సమాజాన్ని మార్చాలనే ఆశయం వేరు. ఆ ఆశయం పవన్‌లో ఉంది. అన్నగారు (ఎన్టీఆర్‌) మాదిరిగా ఈయన ఆశయం కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలనే. ఎన్నికల్లో నిలబడగానే గెలుస్తాం, ముఖ్యమంత్రులమైపోతాం అనేది తర్వాత విషయం. మన మాట సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఈ సమాజాన్ని బాగుచేయడానికి మన వంతు కృషి చేయాలి అనే ఆలోచన గొప్పది. అదే విషయాన్ని పవన్‌ గత కొంత కాలంగా చెబుతున్నారు. ఎవరు కలిసి వచ్చినా? రాకపోయినా తన పోరాటం తాను చేసుకుంటూ వెళ్లిపోయేవాడు వీరుడు. కాబట్టి అతడి వాయిస్‌ చట్టసభల ద్వారా వినిపించాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఆయన మనసు నాకు బాగా తెలుసు. మనకంటే ఆయనకే ప్రపంచం ఎక్కువగా తెలుసు అని భావిస్తున్నా. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నించే హక్కుని వచ్చే ఎన్నికల్లో ఆయన పొందాలని కోరుకుంటున్నాను" అని పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

ఇదీ చూడండి: మహేశ్​ కాకుండా కృష్ణకు నచ్చిన ఈ తరం హీరో ఎవరంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.