జాతీయ ఉత్తమ మ్యూజిక్​ డైరెక్టర్​గా తమన్​.. బెస్ట్​ యాక్టర్స్​గా సూర్య, అజయ్​ దేవగణ్​

author img

By

Published : Jul 22, 2022, 4:49 PM IST

Updated : Jul 22, 2022, 6:54 PM IST

National Film Awards Announced by Central Govt

16:42 July 22

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటించిన కేంద్రం

68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారాల్లో.. తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫోటో ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రంగా నాట్యం, ఉత్తమ సంగీతచిత్రంగా అల వైకుంఠపురములో నిలిచాయి. నాట్యం చిత్రానికి గానూ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో అవార్డులు వరించాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్‌ ఎంపికయ్యారు.

జాతీయ చలనచిత్రం అవార్డుల్లో తమిళ సినిమా సూరారైపోట్రు(ఆకాశమే నీ హద్దురా)కు 3అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటీనటుల అవార్డులు వరించాయి. అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన తానాజీ చిత్రానికి రెండు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డులకు ఎంపికైంది. సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా)లో నటించిన సూర్య, తానాజీ హీరో అజయ్‌ దేవగణ్‌ ను ఉత్తమ కథానాయకులుగా ఎంపికయ్యారు. సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) హీరోయిన్‌ అపర్ణ బాలమురళి ఉత్తమ నటిగా ఎంపికైంది.

15 ప్రాంతీయ భాషా చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ కుటుంబ చిత్రంగా మరాఠీకి చెందిన కుంకుమార్చన్‌ ఎంపికైంది. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ ఫిక్షన్ స్టోరీ చిత్రంగా అసోంకు చెందిన కచ్చి చినుకుకు అవార్డ్‌ దక్కింది. అడ్మిటెడ్‌ సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించారు. ఫిల్మ్‌ ఫ్రెండ్లీ రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌లు ఎంపికయ్యాయి. ఈ ఏడాది బెస్ట్ క్రిటిక్‌ అవార్డు ఎవరికీ ఇవ్వలేదని జ్యూరీ సభ్యులు ప్రకటించారు.

ఈ ఏడాది మొత్తం 30భాషల్లో 305 ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంట్రీకి వచ్చినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటరిగిలో 20భాషల్లో 148 చిత్రాలు స్క్రీనింగ్‌కు వచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది అవార్డులను 5 కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్‌, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌, బెస్ట్‌ రైటింగ్‌ సెక్షన్‌, మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.

జాతీయ అవార్డుల విజేతలు వీరే

  • ఉత్తమ నటుడు: సూర్య-సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా), అజయ్‌ దేవ్‌గణ్‌ (తానాజీ)
  • ఉత్తమ నటి అపర్ణ బాలమురళి- సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా)
  • ఉత్తమ చిత్రం :సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) (సుధాకొంగర)
  • ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్‌- అయ్యప్పనుమ్‌ కోషియుం( భీమ్లా నాయక్​ )​
  • ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)
  • ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్‌- అయ్యప్పనుమ్‌ కోషియుం ( భీమ్లా నాయక్​)​

ఇదీ చదవండి: హీరో శ్రీ విష్ణుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు?

Last Updated :Jul 22, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.