ETV Bharat / entertainment

Nani Vivek Athreya New Movie : నాని కొత్త ప్రయోగం.. వెరైటీ టైటిల్​లో బడా నిర్మాణ సంస్థలో మూవీ.. వీడియో రిలీజ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 1:16 PM IST

Nani Vivek Athreya New Movie : నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాను ప్రకటించేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజైంది.

Nani Vivek Athreya New Movie : వెరైటీ టైటిల్​లో నాని కొత్త సినిమా.. వీడియో రిలీజ్​
Nani Vivek Athreya New Movie : వెరైటీ టైటిల్​లో నాని కొత్త సినిమా.. వీడియో రిలీజ్​

Nani Vivek Athreya New Movie : నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాను అనౌన్స్​ చేసేశారు. తనతో 'అంటే సుందరానికి' లాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్​టైనర్​ సినిమా చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయతోనే మరో చిత్రాన్ని చేయనున్నారు. వాస్తవానికి ఈ విషయం చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉండగా తాజాగా అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేశారు. నాని 31వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్​టైన్మెంట్​ బ్యానర్​ నిర్మించనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో నానిపై షూట్​ చేస్తున్నట్లు చూపించారు.

'ది మోస్ట్ లవ్​బుల్​ కాంబో ఆఫ్ అవర్​ నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబో ఈజ్ బ్యాక్​' అంటూ రాసుకొచ్చారు. అక్టోబర్​ 24న సినిమా సెట్స్​పైకి వెళ్తుందని, ఆ రోజే ముహూర్తం షాట్ అని చెప్పుకొచ్చారు. ఈ సారి థ్రిల్స్​, చిల్స్​, ఫన్​ కోసం సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు. వీడియోలో బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ మాత్రం యాక్షన్​ ఎంటర్​టైనర్​ తరహాలో ఉంది.

అయితే ఈ సారి అంటే సుందరానికి లాంటి సాఫ్ట్ మూవీ కాకుండా మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం రూపొందించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి'... అంటూ ఇప్పటి వరకు వెరైటీ టైటిల్స్​ పెట్టిన వివేక్ ఆత్రేయ... ఈ చిత్రానికి కూడా డిఫరెంట్​ టైటిల్​ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సరిపోదా శనివారం అనే టైటిల్ వినిపిస్తోంది.

ఇకపోతే అంటే సుందరానికి సినిమా కమర్షియల్​గా పెద్దగా సక్సెస్ కాలేదు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. దీంతో దర్శకుడు వివేక్ ఆత్రేయతో నాని తన 31వ సినిమా కోసం కమిట్​ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్​ కూడా చివరి దశకు చేరుకుంది.

శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోరుణ్ మోహన్​ హీరోయిన్​ అని తెలిసింది. దానయ్య నిర్మిస్తున్న మరో సినిమా పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో కూడా ఈమెనే కథానాయిక. అలా ఓ నిర్మాణ సంస్థలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తోంది ప్రియాంక. కాగా, నాని ప్రస్తుతం శౌర్యువ్​తో కలిసి తన 30వ సినిమా హాయ్ నాన్న చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tiger Nageswara Rao Opening Collections : ఫస్ట్​ డే రిపోర్ట్​.. 'లియో', 'భగవంత్​ కేసరి' కన్నా తక్కువే.. ఎంతంటే?

Pooja Hegdey Tennis Photoshoot : టెన్నిస్​ బేబీగా బుట్టబొమ్మ.. పొట్టిగౌన్​లో ఫుల్​ హాట్​ గురూ.. అతడి కోసమేనట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.