ETV Bharat / entertainment

Nani Rajinikanth : రజనీ-అమితాబ్​ సినిమా.. నాని నో చెప్పడానికి అసలు కారణమిదా?.. తెలిసిపోయిందిగా!

author img

By

Published : Aug 17, 2023, 12:26 PM IST

Nani Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్‌-బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్‌ కలిసి నటించనున్న సినిమాకు నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఎందుకు నో చెప్పారో తెలిసింది. ఆ సంగతులు..

రజనీ-అమితాబ్​ సినిమా.. నాని నో చెప్పడానికి అసలు కారణమిదే!
రజనీ-అమితాబ్​ సినిమా.. నాని నో చెప్పడానికి అసలు కారణమిదే!

Nani Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్‌-బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్‌ కాంబోలో దాదాపు 32 ఏళ్ల తర్వాత ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'జై భీమ్‌' ఫేమ్‌ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఇది రూపొందనుంది(Rajinikanth Gnanavel). అయితే ఈ చిత్రంలో యంగ్​ హీరో పోషించాల్సిన ఓ కీలక పాత్ర కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించగా.. ఆయన తిరస్కరించారని వార్తలు వచ్చాయి. దీంతో శర్వానంద్​ ఆ అవకాశాన్ని అందుకున్నట్లు తెలిసింది.

Nani Rejected Rajinikanth Movie : అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. నాని ఎందుకు నో చెప్పారో తెలిసింది. సినిమాలో పాత్ర నెగటివ్​ షేడ్స్​తో ఉంటుందట. విలన్​ పాత్ర అని అంటున్నారు. అందుకే నాని సున్నితంగా నో చెప్పి రిజెక్ట్ చేశారట. దీంతో ఆ ఛాన్స్​ శర్వానంద్ దగ్గరికి వెళ్లగా.. ఆయన ఓకే చేశారని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్​మీడియాలో తిరుగుతోంది.

Rajinikanth Amitabh Bachan Movies : ఇకపోతే రజనీకాంత్‌కి ఇది 170వ చిత్రం. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు వివరాలను.. సినిమాను అధికారికంగా ప్రకటించి త్వరలోనే తెలియజేయనున్నారు. కాగా, గతంలో అమితాబ్​-రజనీ కలిసి 'హమ్', 'గిరఫ్ తార్' సహా మరో చిత్రంలో నటించారు. ఈ చిత్రాలు అప్పట్లో బాక్సాఫీస్​ వద్ద మంచి హిట్ టాక్​ను సొంతం చేసుకున్నాయి.

ఇకపోతే రజనీ నటించిన జైలర్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్​ ముందు సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతూ.. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. తెలుగులోనూ మంచి వసూళ్లను అందుకుంటూ అభిమానుల ప్రశంసలను అందుకుంటోది. వరల్డ్​ వైడ్​గా ఇప్పటివరకు రూ.425కోట్ల వరకు వసూళ్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే రజనీ తన కూతురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లాల్ సలామ్' చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించారు. మొయిద్దీన్ అనే భాయ్‍ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్​ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్​గా థియేటర్లలో విడుదల​ కానుంది.

సన్నీ'గదర్ 2'- రజనీ 'జైలర్​'-చిరు 'భోళా' కలెక్షన్స్​.. ఆరో రోజు భోళాజీ ఒక్కరే అలా.. ఆ రికార్డ్ బ్రేక్​!

Jailer VS Vikram Collection : కమల్​ హాసన్​ 'విక్రమ్​' ఆల్​టైమ్​ రికార్డ్​ కలెక్షన్స్​ బ్రేక్​.. 'జైలర్' ఎన్ని వందల కోట్లు సాధించిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.