ETV Bharat / entertainment

RRR, 'బాహుబలి' తర్వాత 'దసరా'నే.. నాని రెమ్యునరేషన్​ ఎంతంటే?

author img

By

Published : Mar 29, 2023, 10:32 PM IST

నాని హీరోగా నటించిన 'దసరా' మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. మరి ఈ చిత్రం ఎన్ని వేల థియేటర్లలో రిలీజవ్వనుంది, ఈ చిత్రానికి నాని ఎంత రెమ్యునరేషన్​ తీసుకున్నారు? వంటి విషయాలను తెలుసుకుందాం..

Nani Dasara remuneration
RRR, 'బాహుబలి' తర్వాత 'దసరా'నే.. నాని రెమ్యునరేషన్​ ఎంతంటే?

తన టాలెంట్​ యాక్టింగ్​ స్కిల్స్​తో నాచురల్ స్టార్​గా ఎదిగారు నాని. మీడియం రేంజ్ హీరోగా ఎన్నో హిట్​లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ఈ సారి పాన్‌ ఇండియా చిత్రం 'దసరా'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాబోతున్నారు. నాని కెరీర్​లోనే డిఫరెంట్ జానర్​గా.. నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిందీ సినిమా. కీర్తిసురేశ్‌ హీరోయిన్​గా నటించింది. మరో రోజులో మార్చి 30న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైనా నాని, కీర్తి లుక్స్​, ప్రచార చిత్రాలు.. సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. సినీ ప్రేక్షకులు, నాని అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో మూవీటీమ్​.. ఈ సినిమాను భారీగా రిలీజ్​ చేయాలని నిర్ణయించింది. కథకు ఉన్న మంచి డిమాండ్‌ రావడంతో నిర్మాణ సంస్థ భారీగా ఖర్చు చేసినట్లు తెలిసింది. క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టిందట. ఇక సినిమాను తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణాలో అత్యధిక థియేటర్‌లలో విడుదల చేయనుందట. 1300కు పైగా థియేటర్లలో రిలీజ్​ కానున్నట్లు తెలుస్తోంది.

అలా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను వరల్డ్​వైడ్​గా 3 వేలకు పైగా థియేటర్స్‌లో రిలీజ్​ చేసేందుకు మూవీటీమ్​ సిద్ధమైంది. ఇప్పటివరకూ అతి తక్కువ సినిమాలు మాత్రమే 3 వేలు అంతకన్నా ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాయి. 'బాహుబలి సిరీస్​, సైరా, సాహో, రాధేశ్యామ్‌, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, లైగర్‌.. ఇప్పటివరకూ అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్​ అయిన తెలుగు చిత్రాలుగా రికార్డుకెక్కాయి. ఇప్పుడీ జాబితాలో నాని మూవీ కూడా చేరనుంది.

కాగా, ఈ సినిమాలో నాని.. ఇప్పటివరకూ చూడని సరికొత్త లుక్‌లో రగ్డ్​గా కనిపించనున్నారు. క్లైమాక్స్​ సన్నివేశాలు.. ఎమోషన్స్‌తో పాటు, మాస్‌ను మెప్పించేలా అదిరిపోయే ఫైట్స్‌తో సాగుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా కచ్చితంగా హిట్​ అవుతుందని నాని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రీసెంట్​గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రంతో మనసుని హత్తుకునే మాస్‌ సినిమా చూపించబోతున్నట్లు తెలిపారు. "మాస్‌ సినిమాలు చూసి విజిల్స్ వేసి ఉంటారు. కానీ, ఈసారి ఆనందం, ఎమోషన్స్​తో విజిల్స్‌ వేస్తారు. ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం" అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ చిత్రానికి హీరో నాని రూ.15 కోట్లు, హీరోయిన్​ కీర్తి సురేశ్​ రూ.2 కోట్ల వరకు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ముందు నాని రూ.12 కోట్లు తీసుకునేవారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఈగ'లో నానికి రాజమౌళి అందుకే ఛాన్స్ ఇచ్చారంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.