ETV Bharat / entertainment

'భోళా శంకర్'​ ప్రమోషన్స్​ కోసం చిరు కటౌట్​​.. టాలీవుడ్​లో అతిపెద్దదిగా రికార్డు..

author img

By

Published : Jul 29, 2023, 4:32 PM IST

Updated : Jul 29, 2023, 5:34 PM IST

Chiranjeevi Bhola Shankar Cutout : మెగాస్టార్ చిరంజీవి త్వరలో 'భోళా శంకర్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే మూవీ ప్రమోషన్స్​లో భాగంగా చిత్ర యూనిట్​ ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. ఇందు కోసం చిరంజీవి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసింది. ఎక్కడంటే..

Chiranjeevi Bhola Shankar Cutout
చిరంజీవి భోళా శంకర్​ కటౌట్​

Chiranjeevi Bhola Shankar Cutout : 'గాడ్​ ఫాదర్'​, 'వాల్తేర్ వీరయ్య' లాంటి బ్లాక్​ బస్టర్​ చిత్రాలను టాలీవుడ్​ ఇండస్టీకి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. 'భోళా శంకర్' సినిమాతో మరో సాలిడ్ హిట్​ ఇచ్చేందుకు బాక్సాఫీస్​ ముందుకు రానున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ​ సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇటీవలే షూటింగ్​తో పాటు పోస్ట్​ ప్రొడక్షన్​ పనులను ముగించుకున్న ఈ సినిమా ఆగస్ట్​ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే టీజర్​, ట్రైలర్​తో పాటు మూడు సాంగ్స్​ రిలీజ్​ చేసి సినిమాకు హైప్​ పెంచిన మూవీ టీమ్​.. ప్రమోషన్లలో భాగంగా ఓ గ్రాండ్​ ఈవెంట్​ను ప్లాన్​ చేసింది.

ఇటీవలే తెలంగాణలోని సూర్యపేట జిల్లాలో విజయవాడ-హైదరాబాద్ హైవే పక్కనున్న రాజు గారి తోట మెగాస్టార్​ చిరంజీవి భారీ కటౌట్​ను ఏర్పాటు చేశారు. ప్రమోషన్స్​లో భాగంగా 'భోళా శంకర్'​ సినిమాలోని ఓ స్టిల్​ను బేస్​గా తీసుకున్న మూవీ మేకర్స్..సుమారు 127 అడుగుల కటౌట్​ను తయారు చేయించారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే, కటౌట్ ఎన్ని అడుగులు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, ఇది 100 అడుగుల కటౌట్ అని కొంత మంది మెగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్​ ఇండస్ట్రీలోనే ఏర్పాటు చేసిన స్టార్స్​ల కటౌట్స్​లో ఇదే అతి పెద్దదని సమాచారం. ​ఇక ఇది చూసిన అభిమానులు 'భోళా శంకర్' సినిమా ప్రమోషన్స్‌పై నిర్మాణ సంస్థ చూపిస్తున్న నిబద్ధతకు హ్యాట్సాఫ్​ చెబుతున్నారు. ఇదే విధంగా మరిన్ని ప్రమోషన్​ కార్యక్రమాలను చేయాలని కోరుతున్నారు.

Bhola Shankar Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమలో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా.. కీర్తి సురేష్ ఆయనకు చెల్లెలిగా కనిపించనున్నారు. ప్రతినాయకుని పాత్రలో బాలీవుడ్​ నటుడు తరుణ్ అరోరా నటిస్తున్నారు. సుశాంత్, మురళీ శర్మ, షాయాజీ శిందే, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, శ్రీముఖి, తులసి, సురేఖా వాణి, బిత్తిరి సత్తి, గెటప్ శ్రీను, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, సత్య, వేణు టిల్లు, తాగుబోతు రమేశ్​, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ కీలక పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్​గా వ్యహహరించారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Jul 29, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.