ETV Bharat / entertainment

Most Profitable Indian Film : రూ.15కోట్ల బడ్జెట్​తో రూ.303కోట్లు.. 2023లో అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రమిదే

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 6:48 PM IST

Updated : Aug 27, 2023, 6:37 AM IST

Most Profitable Indian Film Of 2023
Most Profitable Indian Film Of 2023

Most Profitable Indian Film Of 2023 : ఈ ఏడాది బాక్సాఫీస్ ముందు.. 'పఠాన్​', 'జైలర్'​, 'గదర్​ 2' వంటి సినిమాలు రిలీజై వందల కోట్ల వసూళ్లను సాధించాయి. అయితే ఈ చిత్రాలన్ని బడ్జెట్​ కూడా వందల కోట్లే. కానీ రెండు చిత్రాలు మాత్రం ఈ ఏడాది రూ.15కోట్లతోనే రూపొంది... ఎవరూ ఊహించని రేంజ్​లో వసూళ్లను సాధించాయి. 'పఠాన్​', 'జైలర్'​, 'గదర్ 2' కన్నా ఎక్కువ లాభాలను అందుకున్నాయి. ఆ వివరాలు..

Most Profitable Indian Film Of 2023 : ఈ ఏడాది ఎన్నో సినిమాలు బాక్సాఫీస్​ ముందు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. బడ్జెట్​ విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్నీ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని మంచి టాక్​ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్​ ముందు కాసుల వర్షం కురిపించాయి. ఇలా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్​ సినిమాల జాబితాలో 'పఠాన్', 'వారిసు', 'పొన్నియిన్ సెల్వన్ 2' వంటి సినిమాలు ఉండగా.. తాజాగా ఈ లిస్ట్​లోకి 'గదర్ 2', 'జైలర్' సినిమాలు వచ్చాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ ఏడాది ఆ సినిమానే టాప్..ఇలా భారీ బడ్జెట్​తో తెరకెక్కిన సినిమాలకు .. ఎక్కువ కలెక్షన్‌లు ఉన్నప్పటికీ అత్యధిక లాభాలు అందుకోలేకపోయాయి. అయితే కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్స్‌ లేకుండా తెరకెక్కిన ఓ చిన్న సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్​ ముందు లాభాల పంట పండించింది. అదే పాన్​ఇండియా మూవీ 'కేరళ స్టోరీ' (The Kerala Story). 2023 మే లో విడుదలైన ఈ సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అత్యధిక లాభాలను అర్జించి రికార్డుకెక్కింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్​ బ్యూటీ అదా శర్మ లీడ్​ రోల్​లో కనిపించారు.

సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 303 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా గ్లోబల్ నెట్ హాల్ కూడా రూ. 250 కోట్లకు పైగా దాటింది. ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చుతో పోలిస్తే 1500% పైగా లాభాన్ని అర్జించింది. అలా ఇటీవలే విడుదలైన 'పఠాన్​', 'గదర్​ 2', 'జైలర్​' లాంటి సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది.

ఆ మూడు చిత్రాలకు ఎన్ని లాభాలు వచ్చాయంటే.. బాలీవుడ్​ బాద్​షా నటించిన 'పఠాన్' సినిమా.. సుమారు ఎనిమిది నెలల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ. 1050 కోట్ల మేర వసూళ్లు సంపాదించింది. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్​తో రూపొందిన 'పఠాన్'.. 240 శాతం లాభాన్ని పొంది దూసుకెళ్లింది. అయినప్పటికీ కేరళ స్టోరీ అందుకున్న లాభాల శాతం ముందు ఇది తక్కువే.

మరోవైపు సూపర్​ స్టార్​ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా రూ. 200 కోట్ల(Jailer World Collections) బడ్జెట్‌తో రూపొందగా.. ఈ సినిమా దాదాపు రూ. 525 కోట్ల మేర వసూళ్లను సాధించింది. అంటే దాదాపు 115 శాతం లాభాన్ని అర్జించింది. ఇక సన్నీ దేఓల్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'గదర్'(Gadar 2 collections) కూడా రూ. 80 కోట్ల బడ్జెట్‌లో రూపొంది.. దాదాపు 400 శాతం లాభంతో రూ. 400 కోట్లు సంపాదించిందని ట్రేడ్​ వర్గాల టాక్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పటికీ ఆ సినిమానే టాప్​..
అయితే ఇప్పటి వరకు రిలీజైన అన్నీభారతీయ సినిమాల కంటే అత్యధిక లాభాలను పొందిన సినిమా బాలీవుడ్​ మూవీ ' సీక్రెట్ సూపర్ స్టార్'! యంగ్​ హీరోయిన్​ జైరా వాసిమ్ నటించిన ఈ సినిమా సుమారు రూ. 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా.. దాదాపు రూ. 700 కోట్ల గ్రాస్​తో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 900 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలా ఈ సినిమాకి 4500 శాతం లాభాలు వచ్చాయి. మరోవైపు గత ఏడాది విడుదలైన 'కాంతార', 'ది కశ్మిర్​ ఫైల్స్'​ సినిమాలు కూడా తక్కువ బడ్జెట్​తో రూపొంది అత్యధిక వసూళ్లను అందుకున్నాయి.

Rajinikanth Jailer collections : 'జైలర్' రూ.500+కోట్లు.. ఆ రికార్డ్​లన్నీ బ్రేక్​!

Tollywood Box Office 2023 : టాప్​లో 'వాల్తేరు'.. ఈ ఏడాది భారీ లాభాలు, నష్టాలు తెచ్చిన చిత్రాలివే!​

Last Updated :Aug 27, 2023, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.