ETV Bharat / entertainment

SSMB 28 బిగ్​ అప్డేట్.. హై యాక్షన్​ సీక్వెన్స్​తో ​మహేశ్​ రచ్చ రచ్చ

author img

By

Published : Sep 12, 2022, 11:05 AM IST

Updated : Sep 12, 2022, 12:05 PM IST

Mahesh babu SSMB 28 shooting starts
ఎస్​ఎస్​ఎమ్​బీ 28 బిగ్​ అప్డేట్

సూపర్​స్టార్ మహేశ్​బాబు ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​. త్రివిక్రమ్​తో ఆయన చేయబోయే సినిమా రెగ్యులర్​ షూటింగ్​ను ప్రారంభించుకోనుంది. ఇవాళ హై యాక్షన్​ సీక్వెన్స్​ను తెరకెక్కించనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు SSMB 28 ఇటీవలే పూజాకార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మహేశ్‌బాబు 28వ చిత్రంగా ఇది సిద్ధం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు(సోమవారం) ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్​ సోషల్​మీడియా ద్వారా తెలిపింది. భారీ కెమెరాలతో హై యాక్షన్​ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు పేర్కొంది. సంగీత దర్శకుడు తమన్​ కూడా ఈ విషయాన్ని తెలిపారు. మహేశ్​కు సంబంధించిన కొత్త లుక్​ను కూడా పోస్ట్​ చేశారు.

maheshbabu
మహేశ్​బాబు

కాగా, 'అతడు', 'ఖలేజా' చిత్రాల తర్వాత మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. ఓ పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్‌ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారు. 'మహర్షి' తర్వాత ఈ సినిమా కోసమే వీరిద్దరి కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి: మెగా 154.. డబుల్​ కాదు.. ట్రిపుల్​ బొనాంజ.. మరో స్టార్ హీరో కూడా..

Last Updated :Sep 12, 2022, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.