ETV Bharat / entertainment

Leo Box Office Collection Day 1 : బాక్సాఫీస్​ ముందు 'లియో' రికార్డులు.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 12:25 PM IST

Updated : Oct 21, 2023, 2:35 PM IST

Leo Box Office Collection Day 1 : దళపతి విజయ్​- లోకేశ్​ కనగరాజు కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లియో'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా గురువారం(అక్టోబర్​ 19) థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే ?

Leo Box Office Collection Day 1
Leo Box Office Collection Day 1

Leo Box Office Collection Day 1 : తమిళ నటుడు దళపతి విజయ్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లియో'. లోకేశ్​ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్​ 19న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా తమిళంలో ఆశించిన స్థాయిలో టాక్​ను అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపించింది.

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లను అందుకున్న ఈ సినిమా మొదటిరోజు మంచి బిజినెస్‌ చేసింది. ట్రేడ్​ వర్గాల లెక్కల ప్రకారం.. తొలిరోజు ఈ చిత్రం సుమారు రూ.140కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కోలీవుడ్‌ చిత్రంగా రికార్డు సృష్టించింది.

మరోవైపు నార్త్‌ అమెరికాలో అక్టోబర్‌ 19న విడుదలైన అన్ని సినిమాల్లో 'లియో' టాప్‌ ప్లేస్​లో ఉంది. ఓ కోలీవుడ్‌ సినిమా ఇలా ఓవర్సీస్‌లో టాప్‌ వన్‌లో కొనసాగడం అనేది చాలా అరుదు అంటూ అభిమానులు ట్విట్టర్​లో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్‌ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు.

Leo Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. స్టార్ డైరక్టర్​ లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కించిన ఈ చిత్రంలో కథానాయికగా త్రిష, కీలక పాత్రల్లో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్​ డైరక్టర్​గా అనిరుధ్​ పనిచేశారు. ఈ సినిమాను 7 స్క్రీన్స్​​ స్టూడియోస్​ బ్యానర్​పై ఎస్​ఎస్​ లతిత్​ కుమార్​ నిర్మించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ప్రీమియర్​ షోకు అనుమతి కూడా ఇచ్చింది.

ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విజయ్​ పోస్టర్లు కూడా సోషల్​ మీడియాలో అభిమానులు తెగ ట్రెండ్​ చేశారు. మూవీ టీమ్​ విడుదల చేసిన లియో ట్రైలర్​లో లియోదాస్​గా విజయ్​ యాక్టింగ్, ఆయన మీద చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు సినిమా మీద భారీ అంచనాలను పెంచాయి.

Leo Movie OTT Details : 'లియో' ఓటీటీ డీటెయిల్స్​ లీక్!.. అంత త్వరగా స్ట్రీమింగా?.. ఎప్పుడంటే?

Leo Movie Twitter Review : విజయ్​ 'లియో' రివ్యూ.. 'రోలెక్స్​'తో ఫైట్​... లోకేశ్​ మ్యాజిక్​ చేశాడా లేదా?

Last Updated :Oct 21, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.