ETV Bharat / entertainment

Kushi Pre Release Business : 'లైగర్'​ దెబ్బేసినా 'ఖుషి'కి డిమాండ్​ ఎక్కువే.. ప్రీ రిలీజ్ బిజినెస్​ ఏకంగా ఎన్ని కోట్లంటే?

author img

By

Published : Aug 14, 2023, 7:56 PM IST

Kushi Pre Release Business : విజయ్ దేవరకొండ-సమంత 'ఖుషి' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​ బాగానే జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలు బయటకు వచ్చాయి. ఎన్ని కోట్లంటే?

Kushi Pre Release Business : 'లైగర్'​ దెబ్బేసినా 'ఖుషి'కి డిమాండ్​ ఎక్కువే.. ప్రీ రిలీజ్ బిజినెస్​ ఏకంగా ఎన్ని కోట్లంటే?
Kushi Pre Release Business : 'లైగర్'​ దెబ్బేసినా 'ఖుషి'కి డిమాండ్​ ఎక్కువే.. ప్రీ రిలీజ్ బిజినెస్​ ఏకంగా ఎన్ని కోట్లంటే?

Kushi Pre Release Business : సాధారణంగా ఓ మూవీ డిజాస్టర్ రిజల్ట్​ను అందుకుందంటే.. అది సదరు హీరో-హీరోయిన్-డైరెక్టర్​ నెక్స్ట్​ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్​పై కాస్త ఎంపాక్ట్​ పడే అవకాశాలు ఉంటాయి. కానీ 'ఖుషి' మూవీ విషయంలో అది అంతగా లేనట్టుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్​ బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం తెలిసింది. ఆ వివరాలు కూడా బయట చక్కర్లు కొడుతున్నాయి.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్'తో.. హీరోయిన్ సమంత 'శాకుంతలం'తో.. దర్శకుడు శివ నిర్వాణ 'టక్ జగదీష్'తో.. ఇలా ఈ ముగ్గురు తమ చివరి సినిమాలతో పెద్ద డిజాస్టర్లనే అందుకున్నారు. అయితే ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రొమాంటిక్ లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రానుందీ ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మ్యూజికల్​ హిట్​గా నిలిచాయి. ట్రైలర్ కూడా పర్వాలేదనిపించింది.

Kushi Movie Release Date : మలయాళ మ్యూజిక్ దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. అందుకే నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్​ రిలీజై చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే సినిమాపై హైప్​ బాగానే క్రియేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్​గా రిలీజ్​ చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్​ వివరాల బయట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా శాటిలైట్ డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నాన్​ థియేట్రికల్​ రైట్స్ ద్వారానే ఆల్మోస్ట్ పెట్టిన​ బడ్జెట్​ను రికవర్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు థియేట్రికల్​ హక్కులు కూడా మంచి ధరకే అమ్ముడుపోయాయని తెలిసింది. కేవలం తెలుగు వెర్షన్ థియేట్రికల్​ రైట్స్​ దాదాపు రూ.50కోట్ల వరకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. మంచి బిజినెస్సే జరిగినట్టు చెప్పొచ్చు. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Vijay Devarakonda Marriage News : 'అప్పుడే పెళ్లి చేసుకుంటా.. అనసూయతో నాకేం సంబంధం లేదు!'

Kushi Movie Trailer : భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తానంటున్న విజయ్​.. లవ్ అండ్ ఎమోషనల్​గా 'ఖుషి' ట్రైలర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.