బాలీవుడ్‌లో ఇదే అసలైన హిట్, హాఫ్ సెంచరీ దాటేసిన కార్తికేయ 2

author img

By

Published : Aug 21, 2022, 1:20 PM IST

Etv Bharat

కార్తికేయ 2 మూవీ బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. వసూళ్లతోపాటు అందరి ప్రశంసలు అందుకుంటోంది. నార్త్​లో అయితే ఏకంగా అగ్ర కథానాయకుల సినిమాలను పక్కకు నెట్టేసి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి వారం గ్రాస్​ హాఫ్ సెంచరీ దాటేసింది.

Karthikeya2 Movie One Week Collections: 'కార్తికేయ 2' మూవీ హిందీ వెర్షన్​ విడుదలైన రోజున ఉత్తరాది​ ప్రేక్షకులకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు. కేవలం 50 స్క్రీన్‌ల‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు ఆ స్క్రీన్​ కౌంట్ ఎంతో తెలుసా? సుమారు వెయ్యికు పైగానే! దీన్ని బట్టి ఉత్తరాదిలో నిఖిల్ సిద్ధార్థ సినిమాకు ఎటువంటి ప్రేక్షకాదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వసూళ్ల పరంగానూ సునామీ సృష్టిస్తోంది కార్తికేయ 2. బాలీవుడ్‌ స్టార్‌హీరోలు ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ నటించిన 'లాల్‌ సింగ్‌ చడ్డా', 'రక్షాబంధన్' మూవీలను వెనక్కి నెట్టేసి ఈ సినిమా అటు నార్త్​ ఇటు సౌత్​ ప్రేక్షకులను అలరిస్తోంది.

రోజురోజుకూ బీటౌన్​లో 'కార్తికేయ 2' మూవీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొదటి రోజు ఏడు లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా, ఏడో రోజున రూ. 2.46 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక..రెండో రోజు రూ. 28 లక్షలు, మూడో రోజు రూ. 1.10 కోట్లు, నాలుగో రోజు రూ. 1.28 కోట్లు, ఐదో రోజు రూ. 1.38 కోట్లు, ఆరో రోజు రూ. 1.64 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద వారంలో రూ. 8.20 కోట్లు వసూలు చేసింది. మరో వారం రోజులు హిందీ మార్కెట్‌లో 'కార్తికేయ 2'కు ఇదే విధంగా వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల వారం కలెక్షన్స్​ రూ. 29.55 కోట్ల గ్రాస్ కలెక్ట్​ చేసింది. కర్ణాటకలో రూ.1.64 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.3.25 కోట్లు, హిందీలో రూ.4.45 కోట్లు వసూలు చేసింది.

కలెక్షన్లలో దూసుకెళ్తున్న కార్తికేయ
కలెక్షన్లలో దూసుకెళ్తున్న కార్తికేయ

100 కోట్ల రేసులో కార్తికేయ2.. బాలీవుడ్​లో ఈ సినిమాకు బంపర్ కలెక్షన్స్ రావడం వల్ల 'కార్తికేయ 2' తొలి వారంలో ఈజీగా హాఫ్ సెంచరీ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో రూ.60.12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా నిర్మాణ వ్యయం, విడుదలైన పరిస్థితులు చూస్తే.. 'కార్తికేయ 2' సూపర్ డూపర్ సక్సెస్ అనే చెప్పాలి.

కార్తికేయ టీమ్​కు వర్మ ప్రశంసలు..
'కార్తికేయ - 2' చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రానికి వస్తోన్న కలెక్షన్లు చూస్తుంటే 'ఆర్‌ఆర్‌ఆర్‌' కంటే కూడా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ఇదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆర్జీవీ తాజాగా ట్వీట్‌ చేశారు. "బాలీవుడ్‌ స్టార్‌హీరోలు ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ నటించిన 'లాల్‌ సింగ్‌ చడ్డా', 'రక్షాబంధన్' కంటే నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన 'కార్తికేయ-2' రెండో శుక్రవారం డబుల్‌ కలెక్షన్లు సాధించింది. చూస్తుంటే రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్', ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన 'కేజీయఫ్ ‌- 2' కంటే 'కార్తికేయ - 2' బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌కు నా అభినందనలు" అని వర్మ పేర్కొన్నారు.

వర్మ ట్వీట్​
వర్మ ట్వీట్​

ఇదీ చదవండి:

కలెక్షన్స్​లో దూసుకెళ్తున్న కార్తికేయ 2, దర్శకుడికి బిగ్​బీ సర్​ప్రైజ్​

ఆ సినిమా వల్లే సాయిపల్లవికి ఫిదా ఆఫర్​ వచ్చిందట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.