అడివి శేష్ 'హిట్' ఫ్రాంచైజీలో మహేశ్, పవన్ కనిపిస్తారా?

author img

By

Published : Dec 2, 2022, 4:51 PM IST

HIT Franchise Mahesh Pawan kalyan

'హిట్'​ ఫ్రాంచైజీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో సూపర్​ స్టార్​ మహేశ్​బాబు, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ భాగం అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.

ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌లతో వ‌రుస‌గా ఓ యూనివ‌ర్స్‌ని సృష్టించే దిశ‌గా 'హిట్‌' సిరీస్​ ప్రారంభమైంది. తొలి కేస్‌తో కూడిన సినిమాలో విష్వ‌క్‌సేన్ న‌టించ‌గా, రెండో కేస్‌తో అడివి శేష్ రంగంలోకి దిగారు. తాజాగా విడుదలైన ఈ రెండో భాగం సూపర్‌ రెస్పాన్స్​ను అందుకుంటోంది. హిట్‌ మొదటి కేస్ ఎంత హిట్‌ అయ్యిందో సెకండ్‌ కేస్‌ కూడా అంతే హిట్టు కొట్టిందని చెబుతున్నారు. అయితే ఈ హిట్‌ యూనివర్స్​ను మొత్తం 7 భాగాలుగా ప్లాన్‌ చేసినట్లు నిర్మాతల్లో ఒకరైన నేచురల్​ స్టార్ నాని ఇప్పటికే తెలిపారు. ఈ ప్రకటన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముూడో భాగంలో ఎవరు ఉండబోతున్నారు అనే దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి నేచురల్​ స్టార్ నాని కూడా కనిపిస్తారని, అలాగే విజయ్‌ సేతుపతిని కూడా నటించనున్నారని ప్రచారం సాగుతోంది.

అయితే ఇప్పుడు ఈ హిట్ యూనివర్స్‌లోకి రాబోయే మరి కొందరు పేర్లు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో టాలీవుడ్‌ టాప్‌ హీరోలు పవన్‌ కల్యాణ్‌, సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కామెంట్స్‌ చేసింది మరెవరో కాదు.. ఏకంగా నిర్మాత నాని, హీరో అడివి శేష్‌! యాంకర్​ సుమతో కలిసి వీళ్లు సినిమా ప్రమోషన్స్ చేశారు. ఆ సమయంలో సుమ వీరిని పవన్‌ కల్యాణ్‌- మహేశ్‌ బాబు రాబోతున్నారా ఈ హిట్ యూనివర్స్​లోకి అంటూ ప్రశ్నించింది. అందుకు నాని వాళ్లు రారు అని చెప్పలేదు. పైగా రావచ్చేమో అంటూ పరోక్షంగా రెస్పాండ్‌ అయ్యారు. దీంతో హిట్​ ఫ్రాంచైజీలో మహేశ్​-పవన్​ పేర్లు ట్రెండింగ్ అవుతున్నాయి.

  • ' class='align-text-top noRightClick twitterSection' data=''>

ఇదీ చూడండి: ఘనంగా దర్శకుడు గుణశేఖర్ కూతురి వివాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.