'మూవీ అప్డేట్ ఎన్నిసార్లు చెప్పాలి?.. అలా అడిగితే సినిమాలు చేయడం ఆపేస్తాను!'

author img

By

Published : Mar 18, 2023, 8:45 AM IST

hero ntr teased his fans in daskadhamki pre release event
hero ntr teased his fans in daskadhamki pre release event ()

మాస్​కా దాస్​ విశ్వక్​ సేన్​ హీరోగా నటించిన 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అభిమానులను జూనియర్​ ఎన్టీఆర్ టీజ్ చేశారు. కొరటాల శివ సినిమా అప్డేట్ గురించి అడిగితే సినిమా చేయడం లేదన్నారు. అలా ఆగిడితే ఆపేస్తానని సరదాగా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ఆర్​ఆర్​ఆర్​ సినిమా తర్వాత.. హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం సెట్స్ మీదకు వెళ్లలేదు. డైరెక్టర్​ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇటీవలే అమెరికాలో ఘనంగా జరిగిన ఆస్కార్​ వేడుకల్లో జూనియర్​ ఎన్టీఆర్​ పాల్గొన్నారు. నాటు నాటుకు ఆస్కార్​ దక్కడంతో మురిసిపోయారు. ఆ ఆనందాన్ని తన భార్య లక్ష్మీప్రణతితో మొదట పంచుకున్నట్లు తెలిపారు. ఆస్కార్​ వేడుకల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా తారక్​ హుషారుగా ఉన్నారు. తన అభిమాని విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే వేడుకలో ఎన్టీఆర్​ మాట్లాడారు. ఆ సమయంలో అభిమానులు అందరూ కొత్త సినిమా అప్డేట్ కావాలని అడిగారు. అలా ఆగిడితే ఆపేస్తానని ఎన్టీఆర్ నవ్వుతూ చెప్పారు. అభిమానులను యంగ్ టైగర్ టీజ్ చేశారు. ''ఏంటి అబ్బాయ్! నెక్స్ట్ సినిమా నేనేమీ చేయడం లేదు. (నవ్వుతూ..) ఎన్నిసార్లు చెప్పాలి!? మొన్నే చెప్పాను కదా! త్వరలో మొదలు అవుతుంది, ఆగండి. మీరు అలా అడుగుతుంటే.. నెక్స్ట్ సినిమా చేయడం లేదని చెప్పేస్తా. ఆపేస్తాను కూడా! మీరు (సినిమాలు) ఆపమన్నా.. నేను ఆపలేను. ఒకవేళ నేను ఆపేసినా మీరు ఊరుకోరు. ఆ సినిమా గురించి చెప్పడానికి ఇది సరైన వేదిక కాదు. త్వరలో చెబుతా'' అని అభిమానులతో సరదాగా స్పందించారు ఎన్టీఆర్.

'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్​.. విశ్వక్​సేన్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫలక్ నుమా దాస్', 'పాగల్' చిత్రాల తర్వాత ఒక ఇమేజ్ ఛట్రంలో విశ్వక్ వెళుతున్నట్లు తనకు అనిపించిందని ఎన్టీఆర్​ అన్నారు. అయితే 'అశోక వనంలో అర్జున కళ్యాణం', 'హిట్' చిత్రాలతో తనకు షాక్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. నటుడిగా చేంజ్ అయ్యాడని పేర్కొన్నారు. తనకు చేంజ్ కావడానికి చాలా కాలం పట్టిందన్నారు.

అయితే హీరో కల్యాణ్​రామ్​ నటించిన అమిగోస్​ ప్రీరిలీజ్​ వేడుకోల దర్శక, నిర్మాతపై NTR 30 అప్డేట్లు చెప్పమని ఒత్తిడి తీసురావద్దొని ఎన్టీఆర్​ చెప్పారు. అప్పటికే NTR 30 షూటింగ్​ షెడ్యూల్​ ఖరారైంది. కానీ, నందమూరి తారక రత్న మరణం తర్వాత ముందుగా అనుకున్న తేదీన ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. అయితే ఈ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ లాంఛింగ్​ వేడుకలకు మెగాస్టార్​ చిరంజీవి అతిథిగా రానున్నట్లు సినీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది.

ఎన్టీఆర్ 30 విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు ఆమె పుట్టినరోజున అధికారికంగా వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇంకా అధికారికంగా చెప్పలేదు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.