ETV Bharat / entertainment

హనుమాన్​లోని 'శ్రీరామ దూత' సాంగ్​ విన్నారా? గూస్ బంప్స్ గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 10:43 AM IST

Updated : Jan 3, 2024, 11:13 AM IST

Hanuman Movie New Song
Hanuman Movie New Song

Hanuman Movie New Song : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్​ మూవీ నుంచి శ్రీరామ దూత స్త్రోత్రం పేరుతో కొత్త సాంగ్ రిలీజ్ అయింది. మీరు విన్నారా మరి?

Hanuman Movie New Song : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో హనుమాన్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్​తోపాటు ట్రైలర్, ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశాయి.

తాజాగా ఈ సినిమా నుంచి శ్రీరామ దూత స్తోత్రం లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. "రం రం రం రక్త వర్ణం దినకర వదనం తీక్షద్రష్టం కరాళం రం రం రం రమ్యతేజం" అంటూ సాగిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. సినిమాపై ఒక్కసారిగా మరిన్ని అంచనాలు పెరిగాయని అంటున్నారు. వీఎఫ్ఎక్స్ షాట్స్ నెక్స్ట్ లెవెల్​లో ఉన్నాయని సాంగ్ ను రీషేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సాంగ్​ను సింగర్లు సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఈదర, హర్షవర్ధన్ చావలి ఆలపించారు. గౌరహరి మ్యూజిక్ అందించారు. ప్రశాంత్ వర్క్ మరోసారి తన మార్క్ చూపించనున్నట్లు తెలుస్తోంది. సాంగ్​లో విజువల్ ఎఫెక్ట్స్​ అదిరిపోయాయి. హనుమంతుడి దైవిక శక్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే- అమృత అయ్యర్ హీరోయిన్​గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్​కుమార్​ కీలకపాత్ర పోషిస్తున్నారు. వాన మూవీ ఫేమ్​ వినయ్ రాయ్ విలన్​గా యాక్ట్ చేస్తున్నారు. శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ సహా అనేక దేశాల్లో ఈ చిత్రం జనవరి 12వ తేదీన గ్రాండ్​గా విడుదల కానుంది.

అయితే అదే రోజున సూపర్ స్టార్ మహేశ్​ బాబు గుంటూరు కారం సినిమా కూడా విడుదల కానుంది. దీంతో హనుమాన్​ సినిమాకు దక్కే థియేటర్ల సంఖ్యపై చర్చ జరుగుతోంది. గుంటూరు కారం మూవీకి 90 శాతం థియేటర్లకు దక్కగా ఈ మూవీకి కేవలం 10శాతమే దొరికాయని టాక్. మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్​లో భాగంగా వస్తున్న తొలి మూవీ హనుమాన్​ ఎలాంటి టాక్ సంపాదిస్తుందో చూడాలి.

Last Updated :Jan 3, 2024, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.