ETV Bharat / entertainment

'ఏజెంట్'​ షూటింగ్​లో గాయపడ్డ దర్శకుడు సురేందర్​.. ఆస్పత్రికి తరలింపు!

author img

By

Published : Jan 7, 2023, 8:11 PM IST

'ఏజెంట్' మూవీ షూటింగ్​లో దర్శకుడు సురేందర్ రెడ్డి గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే?

Director Surendar reddy injured in shooting
ఏజెంట్​ షూటింగ్​లో గాయపడ్డ దర్శుకుడు సురేందర్

ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి గాయపడ్డారు. ఆయన ఎడమకాలికి గాయమైంది. ఆయన తెరకెక్కిస్తున్న 'ఏజెంట్' మూవీ షూటింగ్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆయన్న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే సురేందర్​ గాయానికి చికిత్స చేయించుకొని తిరిగి వెంటనే సెట్​లో అడుగుపెట్టి చిత్రీకరణను కొనసాగించారు. గాయంతో బాధపడుతూనే కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

కాగా, భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న 'ఏజెంట్‌'లో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండడంతో ఫ్యాన్స్‌కు ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలవ్వనుంది. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇదీ చూడండి: షూటింగ్​లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్​.. కార్​ ఛేజింగ్ సీన్స్​ తెరకెక్కిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.