ETV Bharat / entertainment

జక్కన్న ఆస్కార్ రేంజ్​కు ఎదగడానికి కారణం.. ఆ ఒక్క ప్రశ్నే!

author img

By

Published : Jul 16, 2023, 8:17 PM IST

Updated : Jul 17, 2023, 6:22 AM IST

బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​ చిత్రాలతో తెలుగు సినిమాను దేశ ఎల్లలు దాటించారు దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్​లో ఆయన రూటే సపరేటు. కెరీర్​లో ఇప్పటివరకు సక్సెస్​ తప్ప ఫెయిల్యూర్​ తెలియని ఆయన గురించే ఈ ప్రత్యేక కథనం..

Rajamouli Life Story
రాజమౌళి స్పెషస్ స్టోరీ

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. పదేళ్ల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయమైన ఆయన.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఒక్కప్పుడు జక్కన్న ఏ పని లేకుండా ఖాళీగా తిరిగారని తెలుసా? అసలు ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆ ఒక్క ప్రశ్న ఆయన జీవితాన్ని మార్చిందని మీకు తెలుసా? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..

సీరియల్​తో ప్రారంభం..
రాజమౌళి తన సినీ జర్నీని మొదట యాడ్స్​, ఆ తర్వాత సీరియల్​తో ప్రారంభించారు. 'శాంతినివాసం' సీరియల్​తో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత 2001లో వ‌చ్చిన 'స్టూడెంట్ నంబర్ 1'తో సినీ డైరెక్టర్​గా మారారు. అలా మొదటి ప్రయత్నంలోనే అదిరిపోయే సూప‌ర్ హిట్​ను అందుకుని గుర్తింపును సాధించారు. ఆ తర్వాత ఎన్నో ఇండస్ట్రీ హిట్​లు, బ్లాక్ బాస్టర్ హిట్​లను అందించారు.

అన్నీ హిట్లే..
ఆ తర్వాత ఇప్పటివరకు తన రెండున్న‌ర ద‌శాబ్దాల సినీ కెరీర్​లో.. మొత్తం 12 చిత్రాలను తెరకెక్కించారు జక్కన్న. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి సిరీస్, ఆర్​ఆర్​ఆర్​ చిత్రాలను రూపొందించారు. ఈ సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఇంకోటి భారీ విజ‌యాన్ని అందుకుంటూ రాజమౌళి స్థాయిని పెంచాయి. ఒక్కటి కూడా పరాజయాన్ని అందుకోలేదు. ఎంతో మంది హీరోలకు స్టార్​డమ్​ను అందించారు. అలానే పాన్ ఇండియా స్టార్స్​గా తీర్చిదిద్దారు.

Rajamouli Life Story
జూనియర్ ఎన్​టీఆర్​తో రాజమౌళి

ఆస్కార్​ తెచ్చిన ఘనత..
మన దేశానికి ఎన్నో ఏళ్లుగా ఆస్కార్​ ఓ క‌ల‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. అలాంటిది ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆయన తన ఆర్​ఆర్​ఆర్​ చిత్రంతో తెచ్చిపెట్టారు. ఈ సినిమా వరల్డ్ బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్​ చంద్రబోస్​ ఈ అవార్డును అందుకున్నారు.

వదిన రాకతో..
అప్పట్లో చెన్నైలో రోజూ కీరవాణి రికార్డింగ్‌ థియేటర్‌కు కల్యాణ్‌ మాలిక్‌తో కలిసి వెళ్లేవారు జక్కన్న. ఆ తర్వాత ఇంటర్‌ గట్టెక్కారు. అనంతరం మళ్లీ కొన్నాళ్లపాటు ఖాళీగానే ఉన్నారు. ఇక అదే సమయంలో కీరవాణికి పెళ్లైంది. వదిన శ్రీవల్లి వచ్చింది. ఆమె రాక జక్కన్న లైఫ్​ను మార్చింది. 'అసలు లైఫ్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నారు' అని శ్రీవల్లి ఓ సారి అడిగిన ప్రశ్నకు.. జక్కన్న దగ్గర సమాధానం లేదు. అప్పటి నుంచే లైఫ్​ను సీరియస్‌గా తీసుకున్నారు జక్కన్న.

Rajamouli Life Story
కీరవాణి కుటుంబ సభ్యులతో రాజమౌళి

ఆ తర్వాత తండ్రి విజేయంద్రప్రసాద్‌ ప్రోత్సాహంతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. క్రాంతికుమార్‌ దగ్గర కూడా సహాయకుడిగానూ కొంతకాలం కెరీర్​ను నెట్టుకొచ్చారు. ఈ క్రమంలోనే రచయితగా విజయేంద్రప్రసాద్‌కు మంచి పేరు రావడం, ఆ తర్వాత తండ్రి దగ్గరే రాజమౌళి పనిచేశారు. ఈ క్రమంలోనే కథలను విన్నట్లుగా.. సినిమా తీసి తెరపై బాగా చూపించలేకపోతున్నారు దర్శకులు. తానైతే ఇంకా బాగా తీయొచ్చని కొన్నిసార్లు భావించి దర్శకుడిగా మారాలనుకున్నారు. అలా డైరెక్టర్​ వృత్తి వైపు అడుగులేశారు.

అవార్డు ఫంక్షన్​లో ఈ విషయాన్ని..
ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు సంబంధించిన ఓ అవార్డు అందుకునే ఈవెంట్​లోనూ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ పేరు రాజనేంద్రి. ఆమే తన ప్రతిభను గుర్తించిందని చెప్పారు రాజమాళి. సినీ రంగం వైపు వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చారు. 'వదిన శ్రీవల్లి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంద'ని వదిన గురించి గొప్పగా చెప్పారు.

Last Updated :Jul 17, 2023, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.