ETV Bharat / entertainment

ఆ సినిమా ఫ్లాప్​.. రెమ్యునరేషన్​ తిరిగిచ్చేసిన చిరంజీవి

author img

By

Published : Oct 13, 2022, 3:41 PM IST

'ఆచార్య' పరాజయం, బాబీతో చేస్తున్న సినిమా, గరికపాటితో వివాదం గురించి మాట్లాడారు మెగాస్టార్​ చిరంజీవి. ఏమన్నారంటే..

acharya flop chiranjeevi
ఆచార్య ఫ్లాప్​పై చిరంజీవి

'ఆచార్య' పరాజయం సహా తన తదుపరి సినిమాలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మేము నటించిన ఏదైనా సినిమా ఫ్లాప్‌ అయితే దాని పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. 'ఆచార్య' ఫ్లాప్‌ అయినందుకు నేను ఏమీ బాధపడలేదు. ఆ సినిమా పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను, చరణ్‌.. 80 శాతం పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సక్సెస్‌ కంటే 'గాడ్‌ఫాదర్‌' సక్సెస్‌నే చరణ్‌ ఎక్కువగా ఆస్వాదిస్తున్నాడు'' అని అన్నారు.

దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమా గురించి మాట్లాడారు చిరు. ''ప్రస్తుతం నేను చేస్తోన్న సినిమాలన్నీ వచ్చే ఏడాది వేసవి నాటికి విడుదలవుతాయి. మార్చి నుంచి కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తా. బాబీ సినిమాలో నా రోల్ ఫుల్‌ మాస్‌ లుక్‌లో ఉంటుంది. సంభాషణలన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు. ఇక, ఈ సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని దీపావళి రోజున విడుదల చేస్తాం'' అని చెప్పారు.

ఇక 'అలయ్‌ బలయ్‌' వేదికగా చిరంజీవిని ఉద్దేశిస్తూ ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. 'చిరు ఫొటో సెషన్‌ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా' అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన మెగా అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆయనకు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో గరికపాటి వివాదంపై చిరు స్పందించారు. ''ఆయన పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు'' అని తెలిపారు. చిరు స్పందనతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైనంది.

ఇదీ చూడండి: బాలయ్య రికార్డుల వేట వెనుక చిన్న కూతురి క్రియేటివిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.