ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా 'మెగా 154' టైటిల్​ టీజర్​.. ఊరమాస్​ గెటప్​లో అదరగొట్టిన చిరు

author img

By

Published : Oct 24, 2022, 11:21 AM IST

Updated : Oct 24, 2022, 11:47 AM IST

అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంవీజి మెగా 154 టైటిల్​ టీజర్ విడుదలైంది. ఇది ఫ్యాన్స్​కు పూనకాలు తెచ్చేలా ఉంది.

Chiranjeevi Mega 154 title teaser announced
పవర్​ఫుల్​గా 'మెగా 154' టైటిల్​ టీజర్​

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా నుంచి తాజాగా దీపావళి సందర్భంగా బిగ్ అప్డేట్​ వచ్చింది. ప్రచారంలో ఉన్న వాల్తేరు వీరయ్య అనే టైటిల్​ను అధికారికంగా ఖరారు చేస్తూ.. టైటిల్ టీజర్​ను రిలీజ్ చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. చిరు డైలాగ్​, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక లుక్ విషయానికొస్తే.. లుంగీ కట్టుకుని, ఉంగరాలు, కడియం, చెవి పోగుతో చిరు ఊరమాస్‌ గెటప్‌లో అదిరిపోయారు. మొత్తంగా ఈ వీడియో మెగా అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. దీనిని చూసిన నెటిజన్లు.. చిరంజీవి నటించిన ఒకప్పటి మాస్‌ చిత్రాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు.

మాస్‌ ఎంటర్‌ టైనర్‌గా రానున్న ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయట. చిత్ర బృందం ఈ సన్నివేశాలు తెరకెక్కించడం పై దృష్టి పెట్టినట్లు సమాచారం. రవితేజ దీనిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ యేర్నేని, వై.రవి శంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అల్లు ఇంట్లో దీపావళి వేడుకలు.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ

Last Updated :Oct 24, 2022, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.