ETV Bharat / entertainment

ఫొటో మూమెంట్​ - మెగా వారసులతో చిరు సెల్ఫీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 7:30 AM IST

Chiranjeevi Latest Selfie : మెగా ఇంట సంక్రాంతి సంబరాలు ఎంత గ్రాండ్​గా జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత మూడు రోజులుగా సాగిన ఈ వేడుకల్లో అటు మెగాతో పాటు ఇటు అల్లు ఫ్యామిలీలు కలిసి సందడి చేశాయి. అయితే తాజాగా ఈ వేడుకల్లో ఓ ఫొటో మూమెంట్​ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆ విశేషాలు మీ కోసం

Chiranjeevi Latest Selfie
Chiranjeevi Latest Selfie

Chiranjeevi Latest Selfie : మెగా ఇంట సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్​గా జరిగింది. బెంగళూరులోని ఓ​ ఫామ్​ హౌస్​లో జరిగిన ఈ వేడుకలో అటు మెగాతో పాటు ఇటు అల్లు ఫ్యామిలీ మెంబర్స్​ పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సినీ తారలు తమ అభిమానుల కోసం నెట్టింట షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా నటుడు నాగబాబు ఇన్​స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు.

"పండుగలు కుటుంబాల మధ్య మనుషుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయి, నా హృదయానికి అత్యంత దగ్గరైన మనషుల సమక్షంలో ఈ పండుగను జరుపుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని నింపింది. ఇది నా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచి ఉంటుంది." అనే క్యాప్షన్​తో నాగబాబు ఆ ఫొటోలను షేర్ చేశారు.

Nagababu Instagram Post : అందులోని ఓ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. మెగా బ్రదర్స్ చిరు, నాగబాబు, కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా, వారి వెనుక మెగా వారసులు ఉన్నారు. అందులో రామ్ చరణ్, అకిరా నందన్​, వరుణ్ తేజ్, ఆద్యా ఉన్నారు. ఇలా వీరిని ఒకే ఫ్రేమ్​లో చూసిన ఫ్యాన్స్ "మెగా వారసులతో మెగా సెల్ఫీ" అంటూ నెట్టింట ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు. ఇక అదే ఫొటోలో వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, చెర్రీ సతీమణి ఉపాసన కూడా కనిపిస్తున్నారు.

ఇక పండుగ సంబరాలు ముగియడం వల్ల బెంగళూరు నుంచి అందరూ తిరుగుపయనమయ్యారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన దంపతులు, అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇలా అందరూ హైదరాబాదుకు తిరిగొచ్చారు. త్వరలో వీరంతా తమ షెడ్యూళ్లతో బిజీ కానున్నారు. 'విశ్వంభర' షూటింగ్​తో మెగాస్టార్ చిరంజీవి, పుష్ప-2 చిత్రీకరణతో అల్లు అర్జున్​, 'గేమ్ ఛేంజర్' సెట్స్​లో రామ్​ చరణ్ ఇలా అందరూ తమ సినిమాల పనుల్లో బిజీ కానున్నారు.

మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా, ఆద్యా

మెగా వేడుకల్లో అర్హ సందడి - దొరికిన బుజ్జి ఫ్రెండ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.