ETV Bharat / entertainment

చిరంజీవి 'గాడ్​ ఫాద‌ర్' రిలీజ్​ అప్పుడే? పవన్​ కోసం టీమ్​ వెయిటింగ్​!

author img

By

Published : Apr 6, 2022, 9:44 PM IST

chiranjeevi-godfather
చిరంజీవీ గాడ్​ఫాదర్​

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్‌ఫాద‌ర్ సినిమా విడుదల తేదీకి సంబంధించి చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 'హరి హర వీరమల్లు' కొత్త షెడ్యూల్​ ఈ నెల 8 నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

మలయాళ సూపర్​ హిట్ 'లూసిఫర్'ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్‌ఫాద‌ర్ టైటిల్​తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్​ ఇప్పటికే 70శాతం పూర్తియినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ ముంబయిలో జ‌రుగుతోంది. గాడ్ ఫాద‌ర్ సినిమాలో కండలవీరుడు స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

అయితే ఈసినిమా విడుదల తేదీపై సోషల్​మీడియాలో ఒక వార్త తెగ వైరల్​ అవుతోంది. చిత్ర‌బృందం అప్పుడే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాను ఆగ‌స్టు 11న విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోందట. వరుసగా సెలవులు ఉండటమే దీనికి కారణమట. అయితే ఇదే తేదీన అఖిల్ ఏజెంట్‌, స‌మంత య‌శోద‌, అమీర్‌ఖాన్ లాల్సింగ్ చ‌ద్దా విడుదల కానున్నాయి. కొణిదెల సురేఖ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌.బీ.చౌద‌రి, ఎన్‌.వీ.ప్ర‌సాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీత‌మందిస్తుండ‌గా.. సినిమాటోగ్రాఫ‌ర్​గా నీర‌వ్ షా పనిచేస్తున్నారు.

పవన్​ కోసం వెయిటింగ్: క్రిష్ దర్శకత్వంలో పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. 50 శాతం చిత్రీకరణను జరుపుకొన్న ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదాపడింది. చాలా గ్యాప్ తరువాత తిరిగి షూటింగును స్టార్ట్ చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. పవన్​ కోసమే వెయింటింగ్​ అట.. ఆయన రావడమే ఆలస్యం షూటింగ్​ షూరు అవుతుందట. ఇప్పటికే చాలా ఆలస్యమైన కారణంగా ఈ సినిమా షూటింగ్​ పూర్తయిన తరువాతనే మరో ప్రాజెక్టు పైకి వెళ్లాలని పవన్ భావిస్తున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.