ETV Bharat / entertainment

ఐదు రోజుల క్రితమే ఓ సినిమాలో నాన్న నటించారు.. ఇంతలోనే..: రవిబాబు

author img

By

Published : Dec 25, 2022, 12:25 PM IST

Updated : Dec 25, 2022, 12:37 PM IST

ఐదు రోజుల క్రితమే నాన్న ఓ సినిమాలో నటించారని చలపతిరావు కుమారుడు రవిబాబు తెలిపారు. ఆయనకు ఎన్టీఆర్‌, మంచి భోజనం, జోక్స్‌ అంటే ప్రాణమని చెప్పారు. ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌తో సినిమాలు చేసే అదృష్టం తన తండ్రికి దక్కిందన్నారు.

chalapathi-rao-son-ravi-babu-about-his-father
chalapathi-rao-son-ravi-babu-about-his-father

చలపతిరావు గురించి చెబుతున్న రవిబాబు

తన తండ్రి ప్రశాంతంగా కన్నుమూశారని నటుడు చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు. తన తండ్రి వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీలో చాలా మంది గొప్పగా చెబుతుంటే ఆనందంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎన్టీఆర్‌, మంచి భోజనం, జోక్స్‌ అంటే ప్రాణమని చెప్పారు. ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌తో సినిమాలు చేసే అదృష్టం తన తండ్రికి దక్కిందన్నారు.

"నిన్న రాత్రి భోజనం చేసే వరకు నాన్న బాగానే ఉన్నారు. భోజనం అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఎలాంటి నొప్పి తెలియకుండా వెళ్లిపోయారు. ఐదు రోజుల క్రితం ఒక సినిమాలో నటించారు. చిత్రపరిశ్రమలో అందరూ బాబాయ్ అని పిలిచే మంచి వ్యక్తి" అంటూ రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Last Updated : Dec 25, 2022, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.