ETV Bharat / entertainment

'స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్లే'.. తెలంగాణ యాసలో దుమ్మురేపిన చిరు

author img

By

Published : Jun 24, 2023, 7:03 PM IST

Updated : Jun 24, 2023, 8:10 PM IST

bhola shankar teaser
భోళా శంకర్‌ టీజర్

Bhola Shankar Teaser : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్‌' సినిమా టీజర్ విడుదలయ్యింది. మీరు టీజర్ చూశారా?

Bhola Shankar Teaser : మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన 'భోళా శంకర్‌' టీజర్​ను మూవీ యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తోంది. దర్శకుడు మెహర్‌ రమేశ్.. ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ జోనర్​గా రూపొందించారు. ఇందులో చిరంజీవి క్యాబ్​ డ్రైవర్​గా కనిపించనున్నారు. టీజర్​ను పూర్తిగా మాస్, యాక్షన్​తో అంశాలతో నింపేశారు. 'షికారుకు వచ్చిన షేర్​' అంటూ తెలంగాణ యాసలో చిరు పలికిన డైలాగ్.. టీజర్​కు హైలైట్​గా నిలిచింది. 'స్టేట్ డివైడ్ అయినా.. అంతా నా వాళ్లే', 'మనకు హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్' అంటూ చెప్పిన డైలాగ్స్​కు విజిల్స్ పడాల్సిందే. కాగా, మహతి స్వర సాగర్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

వాల్తేరు వీరయ్య అంటూ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి హిట్​ అందుకున్న చిరు.. ఈసారి పక్కా తెలంగాణ యాసలో ఫ్యాన్స్​ను అలరించనున్నారు. టీజర్ చూస్తే.. సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా ఉండనుందని తెలుస్తోంది. సంగీతానికి ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యముందని గతంలో చిత్రబృందం తెలిపిన నేపథ్యంలో.. తాజా టీజర్​లో ముఖ్యంగా ఫైట్​ సీన్స్​లో మహతి స్వర సాగర్‌ అద్భుతమైన బ్యాక్​గ్రౌండ్ స్కోర్ అందిచారు. కాగా ఇప్పటికే ఆయా సందర్భాల్లో విడుదల చేసిన సినిమా పోస్టర్​, లిరికల్ సాంగ్స్​కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ చూసిన చిరంజీవి అభిమానులు ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా తమిళంలో అజిత్ కుమార్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' కు రీమేక్​గా 'భోళా శంకర్‌' రూపుదిద్దుకుంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్.. చిరుకు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కథ.. అన్నాచెల్లెళ్ల అనుబంధాల నేపథ్యంలో ఉండనుంది. డైరెక్టర్​ మెహర్​ రమేశ్​ కథలో స్వల్ప మార్పులతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు.

చిరంజీవి ఇదివరకే చాలా సినిమాల్లో కార్మికుడి పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించారు. ఘరానా మొగుడు, ముఠామేస్త్రీ లాంటి సినిమాల్లో ఆయన నటనకు ఇప్పటికి క్రేజ్ ఏ మాత్రమూ తగ్గలేదు. చిరు కెరీర్​లో ఆ పాత్రలకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్​బేస్ ఉంది. ఇక తాజాగా భోళా శంకర్​లో కూడా అలాంటి మాస్ పాత్రలోనే చిరు కనిపిస్తుండడం.. సినిమాపై అంచానాలు పెంచేస్తోంది.

ఏకే ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ మ్యూజికల్ స్పెషలిస్ట్​ మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు మార్తాండ్ కె వెంకటేశ్​ నిర్వర్తిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్​గా వర్క్ చేస్తున్నారు.
సినిమాలో రఘు బాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

Last Updated :Jun 24, 2023, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.