ETV Bharat / entertainment

Bhagavanth Kesari Opening Day Collection : 'భగవంత్ కేసరి' ఫస్ట్​ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 2:44 PM IST

Updated : Oct 20, 2023, 3:02 PM IST

Bhagavanth Kesari Day 1 Collections
Balakrishna Bhagavanth Kesari First Day Collections

Bhagavanth Kesari Opening Day Collection : టాలీవుడ్​ బాక్సాఫీస్​ వద్ద బాలయ్య భగవంత్ కేసరి బాదుడు షురూ అయింది. ఫస్ట్​ డే కలెక్షన్స్ ఎంతంటే?

Bhagavanth Kesari Opening Day Collection : నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. దర్శకుడు అనిల్​ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గురువారం(అక్టోబర్​ 19న)గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్​ అయింది. యాక్షన్​ అండ్ ఎమోషనల్​ కంటెంట్​తో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్​ టాక్​ను అందుకుంది. అయితే ఈ మూవీ మొదటి రోజే బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. ఇంతకీ ఫస్ట్​ డే కలెక్షన్స్​ ఎంతంటే?

Bhagavanth Kesari Gross Collection : సినిమా ట్రైలర్​తోనే మంచి హైప్​ను క్రియేట్ చేసుకున్న ఈ 'భగవంత్ కేసరి' మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్​ను నమోదు చేసింది. వరల్డ్ వైడ్​గా ఈ సినిమా రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్​ను రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.65 కోట్ల వరకు జరగవచ్చని సమాచారం. ఈ లెక్కన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్​ను రాబట్టాల్సి ఉంది.

అయితే 'భగవంత్ కేసరి'తో పాటు తమిళ స్టార్​ విజయ్​ నటించిన 'లియో', మాస్​మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ రెండింటినీ కూడా ఆడియెన్స్​ పాజిటివ్​గా రిసీవ్​ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటి పోటిని బాలయ్య చిత్రం తట్టుకొని రూ.130 కోట్ల గ్రాస్​ను అందుకుంటుందా అనేది వేచి చూడాలి.

హ్యాట్రిక్​ హిట్స్​..
Balakrishna Last 3 Movies : ఈ ఏడాదిని సంక్రాంతి కానుకగా వచ్చిన 'వీరసింహారెడ్డి'తో గ్రాండ్​గా ప్రారంభించారు బాలకృష్ణ. దీనికి ముందు 'అఖండ' సినిమాతో కూడా ఆకట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్​ డూపర్ హిట్​ను అందుకున్నాయి. కాగా, తాజాగా నటించిన 'భగవంత్​ కేసరి' కూడా ఆ దిశగా అడుగులు వేస్తుండడంతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ హ్యాట్రిక్ హిట్స్​తో సక్సెస్​ను మూవీటీంతో ఎంజాయ్​ చేస్తున్నారు బాలయ్య.

సెట్స్​లో శ్రీలీల, బాలయ్య ఫన్​..
Balakrishna Making Fun With Sreeleela : ఇదిలా ఉంటే సినిమా షూటింగ్​ సమయంలో సెట్స్​లో బాలయ్య, శ్రీలీల, కాజల్​ అగర్వాల్​తో పాటు డైరెక్టర్​ అనిల్​ రావివూడి పూయించిన నవ్వుల వీడియోను షైన్​ స్క్రీన్స్​ బ్యానర్​ ఇటీవలే యూట్యూబ్​లో పోస్ట్​ చేసింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన ఫ్యాన్స్​, నెటిజెన్స్​ తెగ ఎంజాయ్​ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Leo Box Office Collection Day 1 : బాక్సాఫీస్​ ముందు 'లియో' రికార్డులు.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే?

Tiger Nageswara Rao Twitter Review : థియేటర్లలో మాస్​ మహారాజ్​ మేనియా.. 'టైగర్ నాగేశ్వరరావు' ఎలా ఉందంటే ?

Last Updated :Oct 20, 2023, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.