ETV Bharat / entertainment

ఈ సారి వారం గ్యాప్​లో బాలయ్య-పవన్​.. ఇక ఫ్యాన్స్​కు పండగే!

author img

By

Published : Feb 21, 2023, 3:32 PM IST

నందమూరి బాలకృష్ణ NBK 108 - పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ 'హరిహర వీరమల్లు' చిత్రాలు వారం రోజుల గ్యాప్​లో థియేటర్​లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దసరాకు ఈ చిత్రాలు రిలీజ్​ కానున్నాయట. ఆ వివరాలు..

Balayya pawankalyan
దసరా బరిలో బాలయ్య-పవన్​.. వారం రోజుల గ్యాప్​లో..

రీసెంట్​గా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో సంక్రాంతి బాక్సాఫీస్​ జాతర ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకనిర్మాతలందరూ సమ్మర్​, దసరా సీజన్​ బెర్త్​లను ఖరారు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. త్వరత్వరగా తమ చిత్రాల షూటింగ్​లను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా SSMB 28, సలార్​, హరిహర వీరమల్లు, ఎన్​బీకే 108 సహా పలు సినిమాలు దసరా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభాస్ సలార్​ సెప్టెంబరు 28న రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. కానీ మిగతా చిత్రాలు మాత్రం ఇంకా కచ్చితమైన డేట్స్​ను సెట్​ చేసుకోలేదు.

కానీ ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు, ఎన్​బీకే 108 సినిమాలు రిలీజ్​ డేట్స్​ వివరాలు బయటకు వచ్చాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్​లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. అంటే ఈ సంక్రాంతికి ఒక్కరోజు గ్యాప్​తో చిరు-బాలయ్య పోటీపడగా.. ఈ దసరాకు ఏడు రోజుల గ్యాప్​లో బాలయ్య పవన్​ పోటీ పడనున్నారని అర్థమవుతోంది.

ఇక హరిహర వీరమల్లు విషయానికొస్తే.. పవర్​స్టార్​​ పవన్ కళ్యాణ్ కెరీర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నారు. తొలిసారి పవన్​.. ఇటువంటి పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి చారిత్రక కథనంతో ఈ మూవీ పాన్ ఇండియా యాక్షన్​ చిత్రంగా తెరకెక్కుతోంది. ఏఎం రత్న నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ గజదొంగగా కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ సినిమా అక్టోబర్​ 13న విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

అలాగే అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్​ టు బ్యాక్​ వరుస హిట్​లను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం అనిల్ రావిపూడితో NBK 108 సినిమా చేస్తున్నారు. ఫాదర్ అండ్ డాటర్​ సెంటిమెంట్​తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు కూతురిగా హీరోయిన్​ శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్​ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ రెండు చిత్రాలు అనుకున్న సమయానికి వస్తే.. వారం రోజుల వ్యవధిలో పవన్-బాలయ్య థియేటర్లలో సందడి చేసినట్లవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇదీ చూడండి: ఎగ్జామ్స్​ ఎఫెక్ట్​.. థియేటర్​లో చిన్న సినిమాలు.. ఓటీటీలో బ్లాక్​బస్టర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.