ETV Bharat / entertainment

Avatar 2 OTT Release : ఓటీటీలోకి అవతార్​ 2 అప్పుడే.. స్ట్రీమింగ్​ తేది అదే..?

author img

By

Published : Dec 24, 2022, 10:28 PM IST

Avatar 2 OTT Release : సరికొత్త ప్రపంచంతో ప్రేక్షకులను అలరించింది అవతార్​ 2. తాజాగా ఈ సినిమా ఓటీటీపై చర్చ జరుగుతోంది. కాగా, ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫాంలో అవతార్​ 2 విడుదల కాబోతుందని సమాచారం. విడుదల తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.

Etv Bharat
Etv Bharat

Avatar 2 OTT Release : సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల కళ్లముందు ఆవిష్కరించింది అవతార్​ చిత్రం. దర్శకుడు జేమ్స్​ కామెరూన్ మేధోమథనం నుంచి పుట్టిన పండోరా ప్రపంచం వీక్షకుల మదిని దోచుకుంది. ఇటీవల అవతర్​ 2 దాదాపు 160 భాషల్లో విడుదలై.. అద్భుత విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వరల్డ్​ వైడ్​గా రికార్డులు బద్దలుగొడుతున్న ఈ సినిమా డిజిటల్​ రైట్స్​ను డిస్నీ+ హాట్​ స్టార్​ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ గానీ, ఓటీటీ సంస్థ గానీ అధికారికంగా స్పందించలేదు.

avatar 2 ott release
అవతార్​ 2

అయితే, అవతార్​ 2 సినిమా డిస్ట్రిబ్యూషన్​ హక్కులను 21 సెంచరీ ఫాక్స్​ అనే మీడియా కంపెనీ సొంతం చేసుకుంది. ఈ కంపెనీని 2017లో వాల్డ్​ డిస్నీ సంస్థ 52.4 బిలియన్​ డాలర్లకు కొనగోలు చేసింది. దీంతో అవతార్​ 2 సినిమా డిస్నీ+ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్​ అవడం లాంఛనమేనని సినీ వర్గాల సమాచారం. అయితే సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు.. దాదాపు 60 రోజుల్లోగా ఓటీటీలోకి వస్తాయి. కానీ అవతార్​ విషయంలో ఒక ఒప్పందం ప్రకారం దాదాపు 200 రోజుల తర్వాత ఒటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం, ఏప్రిల్​ 2023లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడించేవరకు ఈ విషయంపై స్పష్టత రాదు.

avatar 2 ott release
అవతార్​ 2

మొదటి రోజు నుంచి హిట్​ టాక్​ అందుకుని ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు కొల్లగొడుతోంది అవతార్-2. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి వారాంతంలో రూ. 56 కోట్ల గ్రాస్ తో పాటు రూ. 34 కోట్ల షేర్ కూడా వసూల్ చేసింది. ఈ మేరకు బాక్సాఫీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

avatar 2 ott release
అవతార్​ 2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.