ETV Bharat / entertainment

August tollywood movie releases 2023 : ఆగస్ట్ సినీ జాతర.. ఒకేసారి 25 సినిమాలు.. వారానికో మెగా హీరో సందడి

author img

By

Published : Aug 1, 2023, 12:33 PM IST

August tollywood movie releases 2023 : ఆగస్టు నెలలో సినీ జాతర నెలకొంది. దాదాపు 20 నుంచి 25 సినిమాలు రిలీజ్​కు రెడీ అయ్యాయి. స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. అవేంటంటే

August tollywood movie releases 2023
August tollywood movie releases 2023

August tollywood movie releases 2023 : ఈ ఏడాది సమ్మర్​ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన సినిమాలు చాలా తక్కువగానే ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని 'దసరా', సుప్రీం హీరో సాయితేజ్​ 'విరూపాక్ష'తో పాటు గత నెలలో రిలీజైన శ్రీ విష్ణు 'సామజవరగమన', ఆనంద్​ దేవరకొండ 'బేబీ' సినిమాలు మాత్రమే సెన్సేషన్​ సృష్టించాయి. మంచి వసూళ్లను సాధించాయి. ఇక జులై నెల చివర్లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్​ తేజ్​ 'బ్రో'మిక్స్​డ్ రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా బాగానే రాణిస్తోంది. ఇంకా బాగానే ఆడుతోంది. అయితే ఇప్పుడీ వానాకాలంలో ఫన్​ ఎంటర్​టైన్మెంట్​తో హీట్​ పెంచేందుకు ఆగస్టులో చాలా ఇంట్రెస్టింగ్​ మూవీస్ రెడీస్ అయ్యాయి. అందులో బడా స్టార్ హీరోలు నటించిన ఆసక్తికర చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు ఉన్నారు. ఇంకో విషయమేమింటే.. ఈ నెలలోనే వారానికి ఒక మెగాహీరో సినిమా ఉండటం విశేషం. మరి ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ వారం ఏ చిత్రాలు వస్తున్నాయో చూసేద్దాం.

  • ఈ వారం మాజీ కెప్టెన్ ధోనీ నిర్మించిన 'ఎల్‌జీఎం', కిచ్చా సుదీప్‌ 'హెబ్బులి' ఆగస్టు 4న రిలీజ్ కానున్నాయి. ఇంకా 'రాజుగారి కోడిపులావ్‌', విజయ్‌ ఆంటోనీ 'విక్రమ్‌ రాథోడ్‌', 'మిస్టేక్‌', 'దిల్‌ సే', 'మెగ్‌2' చిత్రాలు విడుదల కానున్నాయి. హిందీలో 'పంచ్‌కృతి: ఫైవ్‌ ఎలిమెంట్స్‌', 'లఫ్జోన్‌ మే ప్యార్‌' సినిమాలు వస్తున్నాయి.
  • రెండో వారంలో రజనీకాంత్ 'జైలర్‌'(ఆగస్టు 10) రాబోతుంది. అలాగే చిరంజీవి 'భోళా శంకర్‌'(ఆగస్టు 11), శ్రీసింహా-కావ్యా కల్యాణ్‌రామ్‌ 'ఉస్తాద్​' ఆగస్టు 12న రిలీజ్ కానుంది. మరోవైపు ఇదే రెండో వారంలో హిందీలో రెండు రిలీజ్ కానున్నాయి. సూపర్ హిట్​ సినిమాలకు సీక్వెల్స్​గా ఇవి రానున్నాయి. అక్షయ్​కుమార్​ 'ఓ మై గాడ్‌2'(ఆగస్టు 11), సన్నీదేఓల్‌ గదర్‌ 2 కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది.
  • మూడో వారంలో పెద్ద సినిమాలేవీ లేవు. ఆగస్టు 18న వైష్ణవ్‌తేజ్‌-శ్రీలీల 'ఆదికేశవ', శ్రీకాంత్‌ అడ్డాల 'పెదకాపు 1', సొహైల్‌ 'మిస్టర్‌ ప్రెగ్నెంట్‌', 'నచ్చినవాడు' చిత్రాలు రిలీజ్ కానున్నాయి. విడుదలవుతున్నాయి.
  • నాలుగో వారంలో వరుణ్‌ తేజ్‌ 'గాంఢీవధారి అర్జున' ఆగస్టు 25, కార్తికేయ 'బెదురులంక 2012', ఆయుష్మాన్‌ ఖురానా-అనన్య డ్రీమ్‌గర్ల్‌ 2 రిలీజ్ కానున్నాయి.
  • ఓటీటీలో మరిన్ని చిత్రాలు రానున్నాయి. జేడీ చక్రవర్తి నటించిన 'దయా' ఆగస్టు 4వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది.
  • శోభిత ధూళిపాళ్ల, అర్జున్‌ మాథుర్‌ నటించిన 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌' సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఆగస్టు 10 నుంచి స్ట్రీమింగ్​కు సిద్ధమైంది.
  • విపుల్‌ అమృతలాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హాట్‌స్టార్‌ స్పెషల్‌ 'కమాండో' ఆగస్టు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
  • గాల్‌ గాడోట్‌, అలియాభట్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం 'హార్ట్‌ ఆఫ్‌ ది స్టోన్‌' ఆగస్టు 11న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.
  • 'ది ఫ్యామిలీమాన్‌', 'ఫర్జీ' లాంటి వెబ్‌సిరీస్​లతో ఆకట్టుకున్న రాజ్‌ అండ్‌ డీకే ద్వయం తెరకెక్కిచిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ 'గన్స్‌ అండ్‌ గులాబ్స్‌'. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావు నటించిన ఈ సిరీస్​ ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇదీ చూడండి :

Taapsee pannu birthday : వారి చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్న తాప్సీ! ఎంత కష్టమైనా వాటికి దూరంగానే!!

Heroine Mrunal thakur Birthday : పాపం మృణాల్ ఠాకూర్.. అంత అవమానం జరిగిందా?..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.