ETV Bharat / entertainment

సందీప్ రెడ్డి ఒరిజినల్​ డైరెక్టర్​- ఆ సీక్వెన్స్​ ఐడియా వారిదే : రణ్​బీర్​ కపూర్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 9:49 PM IST

Updated : Nov 26, 2023, 9:57 PM IST

Animal Movie Promotions Sandeep Reddy Vanga : 'యానిమల్' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా దర్శకుడు సందీప్ రెడ్డిని ప్రశంసిచారు హీరో రణ్​బీర్​ కపూర్. ఆయన ఒరిజినల్ డైరెక్టర్ అని కొనియాడారు. దీంతో పాటు చిత్రంలోని ఓ కీలక సీక్వెన్స్​ గురించి చెప్పారు.

Animal Movie Promotions Sandeep Reddy Vanga
Animal Movie Promotions Sandeep Reddy Vanga

Animal Movie Promotions Sandeep Reddy Vanga : ప్రస్తుతం ఎక్కడ చూసినా 'యానిమల్​' గురించే చర్చ నడుస్తోంది. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్​ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించారు. రణ్​బీర్​ సరసన 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ఆడిపాడింది. బాలీవుడ్​ స్టార్​ నటులు అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 1న .. హిందీతో పాటు తెలుగు, తమిళ్,​ మలయాళం, కన్నడ భాషాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్​ ఇప్పటికే ప్రమోషన్స్​ను ప్రారంభించింది. అందులో భాగంగానే రణ్‌బీర్‌, రష్మిక, బాబీ దేవోల్‌ తదితరులు చెన్నైకి వెళ్లారు. అక్కడి అభిమానులు, మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు రణ్​బీర్​. యానిమల్‌ సినిమా కథ చాలా క్లిష్టమైందని.. అందులో తన పాత్ర ఎన్నో ఎమోషన్స్‌తో కూడుకున్నదని చెప్పారు. మిగతా పాత్రలు కూడా క్లిష్టమైనవే అని తెలిపారు. 'ప్రేక్షకులు తప్పకుండా ఈ క్యారెక్టర్లను, మూవీని ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది. సందీప్‌ రెడ్డి ఒరిజినల్‌ డైరెక్టర్‌.' అని ప్రశంసించారు.

అయితే ఇటీవల యానిమల్​ ట్రైలర్‌ విడుదల చేశారు. అందులో వార్​ మెషీన్​ సీక్వెన్స్​ అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై విలేకరి అడిగిన ప్రశ్నకు రణ్​బీర్ బదులిచ్చారు. 'ప్రొడక్షన్‌ డిజైనర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్‌ దాన్ని చూపించగానే షాక్‌ అయ్యా. అందుబాటులో ఉన్న వస్తువులతో.. ఒరిజినల్‌ వార్‌ మెషీన్‌ను తలపించేలా తీర్చిదిద్దారు. సందీప్‌, సెల్వరాజన్‌లకు వచ్చిన గ్రేట్‌ ఐడియా అది' అని చెప్పారు. కోలీవుడ్‌ గురించి రణ్​బీర్ ప్రత్యేకంగా మాట్లాడారు. విక్రమ్‌ (కమల్‌ హాసన్‌ హీరో), జైలర్‌ (రజనీకాంత్‌ హీరో), లియో (విజయ్‌) తనకు బాగా నచ్చిన సినిమాలని తెలిపారు.

ముఖ్య అతిథులుగా మహేశ్​ బాబు, రాజమౌళి..!
Animal Movie Pre Release Event : ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను సోమవారం (నవంబర్ 27న) నిర్వహించనున్నారు. హైదరాబాద్​లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

  • Some might roar in streets,
    some might roar in certain locations,
    some might roar in a few places,

    but this man can ROAR across the globe with sheer brilliance 🔥

    Our very own @ssrajamouli is the chief guest for #AnimalPreReleaseEvent ❤️‍🔥

    📍 Malla Reddy University, HYD.
    🗓️… pic.twitter.com/WkTVidQKib

    — Animal The Film (@AnimalTheFilm) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'బేబమ్మ రోల్​లో నేను నటించాల్సింది - ఆ కారణం వల్లే ఉప్పెన సినిమా వదులుకున్నా'

బార్బీ బొమ్మలా జాన్వీ కపూర్​ - చీరలో అందాలు దాచేసిందిగా!

Last Updated : Nov 26, 2023, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.