ETV Bharat / entertainment

3 రోజుల్లో రూ. 300 కోట్లు - వీకెండ్​లో భారీ స్థాయిలో పైసా వసూల్​

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 3:20 PM IST

Updated : Dec 4, 2023, 3:39 PM IST

Animal Movie Box Office Collection : రణ్​బీర్ కపూర్ - రష్మిక మందన్నా లీడ్ రోల్స్​లో తెరకెక్కిన 'యానిమల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, మూడో రోజూ వసూళ్ల సునామి సృష్టించింది.

Animal Movie Box Office Collection
Animal Movie Box Office Collection

Animal Movie Box Office Collection : రణ్​బీర్ కపూర్ - సందీప్​రెడ్డి వంగా కాంబోలో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శుక్రవారం (డిసెంబర్ 1) విడుదలైన ఈ సినిమా వీకెండ్​లో హౌస్​ఫుల్ షోస్​తో సందడి చేసింది. తొలి రెండు రోజులు రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకున్న యానిమల్, మూడో రోజు కూడా కాసుల వర్షం కురిపించింది. 3 రోజులు కలుపుకొని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 356 కోట్ల కలెక్షన్లు వసూల్ చేసింది. ఈ కలెక్షన్ వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఇక ఆదివారం ఒక్క రోజే ఈ సినిమా రూ. 120 కోట్లు వసూల్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 'యానిమల్' రోజువారి కలెక్షన్లు..

సినిమాలో హీరో రణ్​బీర్​కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమాలో రణ్​బీర్, రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. తండ్రీ కుమారుల సెంటిమెంట్​తో దర్శకుడు సందీప్​రెడ్డి సినిమాను ఇంకో లెవెల్​కు తీసుకెళ్లారు. తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించారు. ఇక ఈ సినిమాకు తెలుగులోనూ మంచి స్పందన లభిస్తోంది. హిందీ, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కింది.

Animal Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాలో రణ్​బీర్​ కపూర్​తో పాటు రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి, బాబీ దేఓల్​, అనిల్‌ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్​తో ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల్లో మరింత హైప్​ను పెంచారు. ​మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. అక్కడక్కడ నెగిటివ్​ టాక్ అందుకున్నప్పటికీ.. అవేవి నిజం కావంటూ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'యానిమల్​' మూవీలో బోల్డ్​ బ్యూటీ - ఎవరీ తృప్తి ?

'యానిమల్' తొలి రోజు కలెక్షన్స్ రూ.116 కోట్లు - సందీప్​ రెడ్డి మాస్​ పల్స్​ పట్టేశాడుగా!

Last Updated : Dec 4, 2023, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.