ETV Bharat / entertainment

నవీన్ పొలిశెట్టిపై అల్లుఅర్జున్ ప్రశంసలు​.. ఆ విషయంలో అతడే సరైనోడంటూ!

author img

By

Published : Oct 12, 2022, 11:03 AM IST

జాతిరత్నాలు సినిమాతో ఫుల్​ క్రేజ్​ సంపాదించుకున్న యవ హీరో నవీన్ పొలిశెట్టి గురించి మాట్లాడారు ఐకాన్​స్టార్ అల్లుఅర్జున్​. ఏం అన్నారంటే..

Alluarjun naveen polishetty
అల్లుఅర్జున్ నవీన్ పొలిశెట్టి

జాతిరత్నాలుతో ఒక్కసారిగా ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి. కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన 'సైమా' అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రానికి విమర్శకుల ఉత్తమ నటుడిగా నవీన్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్‌, రణ్‌వీర్‌ సింగ్‌తోపాటు దక్షిణాదికి చెందిన స్టార్‌హీరోహీరోయిన్ల సమక్షంలో అవార్డు అందుకోవడం పట్ల నవీన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు తాజాగా ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన వీడియోలో నవీన్​ పొలిశెట్టిపై ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​ ప్రశంసలు కురిపించారు. "అడ్డంకులు రావడం సమస్యే కాదు. మన కలలను సాధించడం కోసం ముందుకు పరుగెత్తాలి. దానికి నవీన్​పొలిశెట్టే క్లాసిక్​ ఎక్సాంపుల్​" అని అన్నారు.

నవీన్​ మాట్లాడుతూ.. కష్టాలు, కన్నీళ్లు, ఆకలి రోజులు, నిద్రలేని రాత్రులు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటే.. తప్పకుండా కలలు నిజం అవుతాయని చెప్పారు. తన కెరీర్​ బెంగళూరులో థియేటర్​ ఆర్టిస్ట్​గా మొదలైనట్లు చెప్పారు. అప్పుడు తాను రూ.750 చెక్​ అందుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు నుంచే నటుడు కావాలని కలలు కన్నట్లు చెప్పారు. అల్లుఅర్జున్​ ఆర్య సినిమా చూసి తప్పనిసరిగా నటుడుగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ చిత్రమే తన స్ఫూర్తి అని పేర్కొన్నారు. కాగా, దక్షిణాదిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సైమా' అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్‌ 10, 11 తేదీల్లో బెంగళూరులో జరిగింది.

  • ' class='align-text-top noRightClick twitterSection' data=''>

ఇదీ చూడండి: ''గాడ్​ఫాదర్'లో​ నాన్నను అలా చూసి చాలా హ్యపీగా ఫీలయ్యా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.