ETV Bharat / entertainment

'ఆదిపురుష్​'.. అభిమానులకు క్షమాపణలు

author img

By

Published : Jul 8, 2023, 12:56 PM IST

Updated : Jul 8, 2023, 2:01 PM IST

Adipurush dialogue writer : 'ఆదిపురుష్' చిత్రంలోని డైలాగులు, ముఖ్యంగా హనుమంతుడి సంభాషణలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మరోసారి ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ స్పందించారు. అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

Adipurush dialogue writer
'ఆదిపురుష్​'.. అభిమానులకు క్షమాపణలు

Adipurush dialogue trolls : 'ఆదిపురుష్' చిత్రంలోని డైలాగులు, ముఖ్యంగా హనుమంతుడి సంభాషణలపై పెద్ద చర్చ సాగిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించారు ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్. తాను రాసిన డైలాగ్​లతో ప్రజల మనోభావాలను దెబ్బతినడం వల్ల క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించారు. "ఆదిపురుష్ వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు భజరంగ్ బలి.. మనల్ని ఐక్యంగా ఉంచి.. పవిత్రమైన సనాతన ధర్మాన్ని, అలాగే మన గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదిస్తాడని భావిస్తున్నాను." అని రాసుకొచ్చారు.

అంతకుముందు తొలిసారి మనోజ్ ముంతాషీర్ ఈ విధంగా స్పందించారు. "ప్రతి ఒక్కరి భావోద్వేగాలను గౌరవించడం రామకథ నుంచి నేర్చుకోవాల్సిన తొల పాఠం అని నా అభిప్రాయం. 'ఆదిపురుష్‌' కోసం నేను 4000 లైన్లకు పైగా సంభాషణలను రాశాను. వాటిల్లో 5 లైన్లు కొందరిని బాగా బాధించాయని, మనోభావాలను దెబ్బతీశాయని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీరాముడిని, సీతమ్మను కీర్తిస్తూ చాలా డైలాగ్స్​ ఉన్నాయి. కానీ వాటి కన్నా ఈ 5 లైన్లే ఎక్కువ ప్రభావం చూపించాయని తెలిసింది. నా సోదరులు ఎంతో మంది నన్ను ఘోరంగా విమర్శిస్తున్నారు. మూడు గంటల సినిమాలో 3 నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు" అని అన్నారు.

ఇకపోతే రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్‌ రాఘవుడిగా, కృతిసనన్‌ జానకిగా నటించారు. భారీ అంచనాల మధ్యఈ చిత్రం జూన్‌ 16న ఆడియెన్స్​ ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే భారీగా విమర్శలను ఎదుర్కొంది. రావణాసురుడు, ఇంద్రజిత్తు లుక్స్‌.. సినిమాలోని డైలాగ్స్​, కొన్నిసీన్స్​.. బాగోలేదంటూ చరిత్రను వక్రీకరించారంటూ పలువురు విమర్శించారు. ముఖ్యంగా ఇంద్రజిత్తు- హనుమంతుడు మధ్య వచ్చే సంభాషణలపై తీవ్రంగా విమర్శలు చేశారు.

హైకోర్టు షాక్​.. ఇటీవలే 'ఆదిపురుష్‌' మూవీటీమ్​కు అలహాబాద్‌ హైకోర్టు షాకిచ్చింది. జులై 27న డైరెక్టర్​ ఓం రౌత్‌, నిర్మాత భూషణ్‌ కూమార్‌, డైలాగ్‌ రైటర్‌ మనోజ్‌ మంతాషిర్‌ను.. న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్నది సమీక్షించాలని.. అలాగే వారి అభిప్రాయాలను తెలియజేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది.

ఇదీ చూడండి :

​'ఆదిపురుష్​' టీమ్​పై ఆ థియేటర్ యజమాని ఫైర్​.. వారిని జైలులో పెట్టాలంటూ..

రావణుడిపై NTR కామెంట్స్ వైరల్.. ఆదిపురుష్​ మేకర్స్​పై పంచ్​లు!

Last Updated :Jul 8, 2023, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.