ETV Bharat / entertainment

'ఆదిపురుష్​' రెండో టీజర్ రిలీజ్​​ డేట్​ ఫిక్స్.. ఈసారి ఏం జరుగుతుందో?

author img

By

Published : Feb 17, 2023, 2:13 PM IST

Updated : Feb 17, 2023, 3:32 PM IST

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్​'. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చింది. ఈ మూవీ రెండో టీజర్​ విడుదల కానుంది. దీంతో ప్రభాస్​ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీజర్​ రిలీజ్​ ఎప్పుడంటే?

Adipurush 2nd Teaser
Adipurush 2nd Teaser

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'​. ఈ చిత్రానికి ఓం రౌత్​ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్​ స్టార్​ సైఫ్​ అలీఖాన్​ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12నే విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కాగా, ఈ సినిమా నుంచి మరో అప్డేట్​​ వచ్చింది. ఈ మూవీ టీజర్​ను మరోసారి విడుదల చేయబోతున్నారు. ఇదివరకు రిలీజైన టీజర్​పై విమర్శలు వెల్లువెత్తడం వల్ల మేకర్స్​ మళ్లీ రిలీజ్​ చేయనున్నారు. అయితే ఈ టీజర్​ను శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

'ఈ సారి రావణుడు ఎలా ఉంటాడో..?'
ఇదివరకు విడుదలైన 'ఆదిపురుష్​' టీజర్​పై తీవ్ర దుమారం రేగింది. అందులో రావణుడి పాత్రపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ పాత్రను సోషల్​ మీడియాలో ట్రోల్​ చేశారు. సినిమా మొత్తం యానిమేషన్​లా ఉందని కామెంట్లు పెట్టారు. ఆంజనేయుడి రూపాన్ని కూడా వక్రీకరించినట్లు ఆరోపణలు చేశారు. సినిమాలో తోలు వస్తువులు ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇదేకాకుండా ఈ సినిమాను బాయ్​కాట్ చేయాలని హ్యాష్​ టాగ్​లు ట్రెండ్​ చేశారు. ఇక, కొంత మంది హిందూత్వ వాదులు ఈ సినిమాపై కేసులు కూడా పెట్టారు. దీంతో వెనక్కు తగ్గిన 'ఆదిపురుష్​' టీమ్​.. దిద్దుబాటు చర్యలు చేపట్టి సినిమాను రీ షూట్​ చేసింది. అయితే, ఇందులోనైనా రావణుడికి మరో కొత్త లుక్​ ఇచ్చారో లేదో వేచి చూడాలి! కాగా, ఈ సినిమా 12 జూన్​ 2023న విడుదల కానుంది.

'ఆదిపురుష్​' చిత్రం విడుదల అయ్యేవరకు 'సలార్​', 'ప్రాజెక్ట్​ కే' చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు ఇవ్వకూడదని ప్రభాస్​ ఆదేశించినట్లు నెట్టింట్లో చర్చ నడుస్తోంది. కాగా, రామాయణం ఆధారంగా చేసుకుని భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్​' సినిమాలో కృతి సనన్​ సీత పాత్రలో నటిస్తోంది. సన్నీసింగ్ లక్ష్మణుడు, సైఫ్​ అలీఖాన్​ రావణుడి పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Last Updated :Feb 17, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.