యాక్షన్​ కింగ్​ అర్జున్​ ఇంట విషాదం

author img

By

Published : Jul 23, 2022, 3:06 PM IST

Actor Arjun mother died

నటుడు అర్జున్​ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

యాక్షన్ కింగ్​ అర్జున్​ సర్జా ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) కన్నుమూశారు. దీంతో అర్జున్​ ఇంట్లో ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఆమె మృతి పట్ల సినీప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అర్జున్​ కుటుంబసభ్యులను పరామర్శిస్తూ.. ధైర్యం చెబుతున్నారు.

ఇదీ చూడండి: క్రికెట్​ ఆడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.