ETV Bharat / entertainment

ఒకేచోట 30 సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ మూవీస్​.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

author img

By

Published : May 4, 2022, 9:17 AM IST

aha hollywood movies
ఆహా హాలీవుడ్ చిత్రాలు

Hollywood movie AHA OTT: ఓటీటీ ప్లాట్​ఫామ్​ 'ఆహా'.. ఇప్పటికే తమిళం, మలయాళం ఇలా చిత్ర పరిశ్రమల్లో ఘన విజయం అందుకున్న సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు హాలీవుడ్​ చిత్రాల అభిమానుల కోసం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30కిపైగా సూపర్‌హిట్‌ ఆంగ్ల చిత్రాలను అందించనుంది. ఆ సినిమాలేంటో చూద్దాం..

Hollywood movie AHA OTT: మీరు హాలీవుడ్‌ చిత్రాల అభిమానులా? అదిరిపోయే ఇంగ్లిష్‌ సినిమాలను చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసం.. ఒకటి కాదు రెండు కాదు 30కిపైగా సూపర్‌హిట్‌ ఆంగ్ల చిత్రాలను అందించనుంది ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'. 'అనకొండ', 'సాల్ట్‌', 'టెర్నినేటర్‌', 'మెన్‌ ఇన్‌ బ్లాక్‌' సిరీస్‌, 'స్పైడర్‌ మ్యాన్‌' సిరీస్‌, 'రెసిడెంట్‌ ఎవిల్‌' సిరీస్‌లతో పాటు మరికొన్ని హాలీవుడ్‌ సినిమాలను ఈ నెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

'ఆహా' ఇప్పటికే.. తమిళం, మలయాళం.. ఇలా చిత్ర పరిశ్రమల్లో ఘన విజయం అందుకున్న సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంగ్ల సినిమాను తీసుకొస్తుంది. ఈ హాలీవుడ్‌ మూవీస్‌ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతాయో తెలియాల్సి ఉంది.

hollywood
ఆహాలో హాలీవుడ్​ చిత్రాలు

ఇదీ చూడండి: 'ఎఫ్​ 3'కి కొనసాగింపుగా 'ఎఫ్​ 4'.. మూవీటీమ్​ ఏం చెప్పిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.