ETV Bharat / crime

ఊహించని ప్రమాదం.. అంతులేని విషాదం

author img

By

Published : Mar 30, 2021, 12:29 PM IST

రైలు ఢీకొనడంతో ఓ యువకుడి మృతదేహం పట్టాలపై పడి ఉంది. ప్రయాణికులు గుమిగూడి తమ చరవాణుల్లో ఫొటోలు తీస్తున్నారు.. ఓ బాలిక సైతం వెళ్లి  ఫొటోలు తీసింది. తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. వాటిని చూస్తుండగా ఆ మృతదేహంపై ఉన్న దుస్తులు తన సోదరుడివే అనే అనుమానం ఆమెకు కలిగింది. విషయం తల్లికి చెప్పడంతో హుటాహుటిన రైలు దిగి మృతదేహం వద్దకు వెళ్లి చూడగా వారి అనుమానం నిజమైంది. అప్పటి వరకు తమతో ఉన్న కుమారుడు కళ్లముందే మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

train accident, peddapalli railway station
రైలు ప్రమాదం, రైలు ఢీకొని యువకుడు మృతి, పెద్దపల్లి రైల్వే స్టేషన్

మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్‌ ఏరియాకు చెందిన ఏడుకోల విశాల్‌(21) అనే విద్యార్థి పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సింగరేణి వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌-రాణి దంపతులు.. కుమారుడు విశాల్‌తో కలిసి కూతురును తీసుకువచ్చేందుకు శనివారం హైదరాబాద్‌కు వెళ్లారు. రెండురోజుల పాటు బంధువుల ఇళ్లలో ఉండి సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు.

హైదరాబాద్‌ నుంచి మందమర్రికి కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ క్రాసింగ్‌ కోసం వీరు ప్రయాణిస్తున్న రైలును పెద్దపల్లి స్టేషన్‌లో నిలిపివేశారు. రైలుదిగి, పట్టాలపైకి వెళ్లిన విశాల్‌ను సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామగుండం జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ తిరుపతి తెలిపారు.

train accident, peddapalli railway station
రైలు ఢీకొని మృతి చెందిన విశాల్

తండ్రికి అస్వస్థత :

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శవపంచనామా అనంతరం మృతదేహాన్ని మందమర్రికి తీసుకువెళ్లారు. కొడుకు మృతితో తండ్రి శ్రీనివాస్‌ అనారోగ్యానికి గురవడంతో సింగరేణి డిస్పెన్సరీకి తరలించారు. రెండు గంటల పాటు చికిత్స అందించి ఇంటికి పంపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.