ETV Bharat / crime

ganja cultivation in hyderabad: యువకుల హైటెక్ డ్రగ్స్ దందా.. ఇంట్లోనే గంజాయి సాగు!

author img

By

Published : Oct 4, 2021, 1:57 PM IST

యువకులు అపార్టుమెంట్ అద్దెకు తీసుకుంటారు. పూల కుండీలు తెచ్చి మొక్కలు పెంచుతారు. కృత్రిమ వాతావరణం సృష్టించి... సాగు చేస్తారు. అంతేకాకుండా ఎల్​ఈడీ లైట్లనూ అమర్చుతారు. ఇంతకీ వాళ్లు పెంచే మొక్కలేంటో తెలుసా...?

ganja farming in hyderabad, ganja cultivation
యువకుల హైటెక్ డ్రగ్స్ దందా, ఇంట్లో గంజాయి సాగు

గిరిజన ప్రాంతాలు, అడవుల్లో పండిస్తున్న గంజాయిని ఇంట్లోనే సాగుచేస్తే(ganja cultivation in hyderabad) పోలా.. అన్న ఆలోచనతో కొందరు యువకులు కృత్రిమ పద్ధతుల్లో సంబంధిత మొక్కలను ఇల్లు, ఫ్లాట్‌, మిద్దెపైన పెంచుతున్నారు.. సాధారణంగా ఎనిమిది నెలల్లో గంజాయి పంట చేతికి వస్తోంది. ఇందుకు భిన్నంగా వీరు హైటెక్‌ పరిజ్ఞానంతో నాలుగు నెలల్లోనే పంటచేతికి వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నారు. ఈక్రమంలో బెంగుళూరులో కొద్దిరోజుల క్రితం అనిరుధ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని జీడిమెట్ల, జియాగూడ ప్రాంతాల్లో ఉంటున్న యువకులు వేర్వేరుగా వారి మిద్దెలపై గంజాయి మొక్కలు పెంచుతుండగా.. పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌చేశారు. గంజాయిని కొనేప్పుడు పోలీసులు పట్టుకుంటే జైలుకు పంపిస్తారన్న భయం, సొంతంగా గంజాయి పండిస్తే దాన్ని విక్రయించవచ్చన్న భావనతో యువకులు కృత్రిమంగా గంజాయి మొక్కలను సాగుచేస్తున్నారని పోలీస్‌ అధికారులు తెలిపారు.

పూలకుండీలు.. కృత్రిమ వాతావరణం..

గోల్కొండలోని గుల్షన్‌ కాలనీలో సయ్యద్‌ షాహెద్‌ హుస్సేన్‌ కృత్రిమ పద్ధతుల ద్వారా నాలుగేళ్ల క్రితం గంజాయిని పండిస్తూ పోలీసులకు చిక్కాడు. తొలుత గంజాయిని వినియోగించే షాహెద్‌ తర్వాత వ్యాపారిగా మారాడు. తాండూరుకు వెళ్లి గంజాయిని రూ.4వేలకు కొనేవాడు.వాటిని పొట్లాలుగా విక్రయించి రూ.16 వేలకు విక్రయించేవాడు. అనంతరం గంజాయిని ఇంట్లోనే సాగు చేయడమెలా? అన్న అంశపై వెబ్‌సైట్లలో శోధించాడు. పూలకుండీల్లో కృత్రిమవాతావరణం సృష్టించి పండించవచ్చంటూ అంతర్జాలంలో గుర్తించాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన గారిత్‌ క్రిస్టఫర్‌ అనే ఆమెరికన్‌తో సాగుపద్ధతులు తెలుసుకున్నాడు. పూలకుండీల్లో గంజాయి మొక్కలను పెంచేందుకు మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. గంజాయి విత్తనాలు తీసువచ్చి 40 పూలకుండీల్లో వాటిని వేశాడు. నీరు, గాలి, వెలుతురు కోసం కృత్రిమంగా ఏర్పాట్లుచేశాడు. వేడి కోసం ఎల్‌ఈడీ బల్బులనూ అమర్చాడు. ఇలా పండించిన(ganja cultivation in hyderabad) గంజాయిని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, యువకులకు విక్రయించేవాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

బెంగళూరులో జోరుగా సాగు

కర్ణాటక రాజధాని బెంగుళూరులో కృత్రిమపద్ధతుల్లో కొందరు యువకులు, నేరస్థులు గంజాయిని గుట్టుగా సాగు చేస్తున్నారు. క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. బెంగుళూరు నగరం, కోరమంగళ, బన్నేరుఘట్ట, ఇతర శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కృత్రిమ గంజాయిని నేరస్థులు విక్రయిస్తున్నారు.

  • బెంగళూరు శివారులోని బిడదిలో జావేద్‌ అనే ఎంబీఏ విద్యార్థి, ఇద్దరు యువకులు కలిసి పూలకుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. ఇందుకోసం వారు ఏకంగా విల్లాను అద్దెకు తీసుకున్నారు. హైడ్రో గంజాయి విత్తనాలను వీరు డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. వేగంగా గంజాయి పండేందుకు కృత్రిమ రసాయనాలను వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నాలుగురోజుల క్రితం విల్లాపై దాడులు చేసి.. రూ.కోటి విలువైన సరకు స్వాధీనం చేసుకున్నారు.
  • కనకపుర, బనాస్‌వాడి, కేఆర్‌ పురం పరిసరాల్లో నివసిస్తున్న కొందరు విద్యార్థులు గంజాయిని పండించేందుకు నగర శివార్లలో ఇళ్లు, ఫాట్లు అద్దెకు తీసుంకుంటున్నారు. బాల్కనీలు, గదుల్లో గంజాయి మొక్కలను సాగుచేస్తున్నారు. రెండేళ్ల క్రితం పోలీసులు 15మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు.
  • బెంగళూరు శివార్లలోని ఓ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో చదువుకుంటున్న రిషి అనే విద్యార్థి.. గంజాయి విత్తనాలను నెదర్లాండ్స్‌ నుంచి కొనుగోలు చేసి స్నేహితుల సాయంతో ఇంట్లోనే పెంచసాగాడు. పంట చేతికొచ్చాక మొక్కలను పొడిగా మార్చి విక్రయిస్తున్నాడు. బెంగుళూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రిషి, అతడి స్నేహితులను డిసెంబరు, 2019లో అరెస్ట్‌చేశారు. రూ.20 లక్షల నగదు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: justice sirpurkar commission: సిర్పుర్కర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సజ్జనార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.