ETV Bharat / crime

'నేనేంటో హైదరాబాద్​ పోలీసులకు చూపిస్తా'.. యువతి హల్​చల్​

author img

By

Published : Jan 1, 2022, 5:34 PM IST

Updated : Jan 1, 2022, 5:59 PM IST

Woman behaved rudely with police: నూతన సంవత్సర వేడుకల్లో తప్పతాగిన ఓ యువతి.. నడిరోడ్డుపై హల్​చల్​ చేసింది. డ్రంక్​ అండ్​ డ్రెవ్​ టెస్టులో నానా హైరానా సృష్టించింది. బ్రీత్​ అనలైజర్ టెస్టులు చేయకుండా పోలీసులను అడ్డుకుని.. తానెవరో హైదరాబాద్​ పోలీసులకు తెలిసేలా చేస్తానని హెచ్చరించింది. అంతే కాకుండా పోలీసు చొక్కా పట్టుకుని వీరంగం సృష్టించింది.

Woman halchal in jubilee hills
పోలీసులతో మహిళ దురుసు ప్రవర్తన

Woman halchal in jubilee hills: అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ యువతి పోలీసులపై వీరంగం సృష్టించింది. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన యువతి.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్న పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించింది. పోలీసులను దుర్భాషలాడింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్న యువతి

పోలీసు చొక్కా పట్టుకుని

Woman behaved rudely with police: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి విధుల్లో భాగంగా.. జూబ్లీహిల్స్​ చెక్​పోస్టు వద్ద పోలీసులు వాహనాలు నిలిపి తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ముంబయికి చెందిన యువతి, మరికొందరు వాహనంలో అటువైపుగా వచ్చారు. కారు నిలిపి బ్రీత్‌ అనలైజర్ పరీక్షలు చేస్తుండగా యువతి.. పోలీసులను దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు యత్నించింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు సహకరించకుండా జులుం చెలాయించింది. వారిని దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించింది. తానేంటో హైదరాబాద్​ పోలీసులకు తెలిసేలా చేస్తానంటూ వారిని హెచ్చరించింది. పోలీసులు ఆమెను నిలువరించేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. మద్యం మత్తులో ఓ పోలీసు చొక్కా పట్టుకుని హల్​చల్​ చేసింది.

సర్ధి చెప్పినా వినకుండా

Drunk and drive tests: ఆమెతో పాటు ఉన్న యువకులు సైతం నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. గొడవ చేస్తున్న యువతిని అదుపు చేయకుండా పోలీసులపై దాడి చేయాలంటూ అరిచారు. మిగతా వాహనదారులు ఆమెకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా రెచ్చిపోయింది. దీంతో పోలీసులు.. యువతితో పాటు కారులో మిగిలిన వాళ్లను అదుపులోకి తీసకున్నారు.

ఇదీ చదవండి: Vanasthalipuram Accident Video: మద్యం మత్తులో కారు నడిపి.. బీభత్సం సృష్టించిన యువకుడు

Last Updated :Jan 1, 2022, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.