ETV Bharat / crime

మద్యం మత్తులో యువతి హల్​చల్.. పోలీసులపై దాడి

author img

By

Published : Dec 15, 2022, 10:27 PM IST

Woman attack on Police: ఏపీలోని విశాఖపట్నంలో ఓ యువతి హల్​చల్​ చేసింది.. బీచ్‌లో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి పాల్పడింది. బీర్​ సీసా విసిరేయడంతో, పోలీసుల పక్కనే ఉన్న ఓ వ్యక్తికి తగిలి గాయమైంది. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

Woman attack on Police
Woman attack on Police

మద్యం మత్తులో యువతి హల్​చల్.. పోలీసులపై దాడి

Woman Attack on Police with Beer Bottle: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో వైఎంసీఏ వద్ద మద్యం గంజాయి మత్తులో అమూల్య అనే యువతి హల్​చల్ చేసింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ.. గంజాయితో కూడిన సిగరెట్ కాల్చుతున్న యువతిని.. విధుల్లో ఉన్న త్రీటౌన్ ఏఎస్ఐ పీవీవీ సత్యనారాయణ వారించారు. దీంతో ఆమె తమపై బీరు బాటిల్​ విసిరేసి.. కాలుతో తన్నినట్లు పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా అసభ్యకర పదజాలంతో దూషించిందన్నారు.

యువతి మద్యం సీసా విసరడం వల్ల గోవింద్ అనే యువకుడికి గాయమైనట్లు వెల్లడించారు. మహిళా పోలీస్ సహకారంతో అమూల్యను మూడో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులను దూషించి, గాయపరచడంతో పాటు.. మద్యం సీసాతో ఇతరులను గాయపరిచినందుకు ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. ఉన్నత చదువులు చదివి గంజాయికి బానిస కావడం.. స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.