ETV Bharat / crime

Minor rape: బాలికపై.. ఇద్దరు బాలురు అత్యాచారం!

author img

By

Published : Aug 31, 2021, 11:56 AM IST

ప్రేమ పేరుతో పద్నాలుగేళ్ల బాలికను నమ్మించాడు ఓ బాలుడు. అటుపై తన మిత్రుడితో కలిసి అత్యాచారం చేసి.. ఆమెను గర్భవతిని చేశారు. ఏపీలోని విశాఖ జిల్లా బుచ్చిరాజుపాళెంలో ఈ ఘటన జరిగింది.

visakhapatnam-airport-police-have-arrested-two-boys-in-a-rape-case
visakhapatnam-airport-police-have-arrested-two-boys-in-a-rape-case

పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమె గర్భవతి అవడానికి కారణమైన 16,17 ఏళ్ల ఇద్దరు అబ్బాయిలను ఏపీ విశాఖ ఎయిర్​పోర్టు పోలీస్​స్టేషన్​ పోలీసులు బాలల సంరక్షణ గృహానికి తరలించారు. విశాఖ జిల్లా బుచ్చిరాజుపాళెంలో నివాసం ఉంటున్న బాలికను, అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు ప్రేమ పేరుతో నమ్మించి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి గర్భవతిని చేశాడు. బాలికలో వచ్చిన శారీరక మార్పులను గుర్తించి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు ఆ ఇద్దరు బాలురపై ఎయిర్​పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండీ:

Engineering Counselling: ఇంజినీరింగ్ కొత్త విధానమేంటి? కౌన్సెలింగ్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.