ETV Bharat / crime

కల్వర్టును ఢీకొన్న బైకు... ఇద్దరు యువకులు మృతి

author img

By

Published : Mar 12, 2021, 9:30 AM IST

two died and one injured in bike accident at arvapally
two died and one injured in bike accident at arvapally

08:38 March 12

అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక్క యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హన్మకొండ నుంచి స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోటంచ గ్రామానికి ద్విచక్రవాహనంపై తెల్లవారుజామున వెళ్తుండగా... అర్వపల్లి వద్ద అదుపుతప్పి కాల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా... ఇంకో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

మల్లవేని హనుమంతు, గైరి రాకేశ్​ మృతి చెందగా... హరికృష్ణ గాయపడ్డాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ముగ్గురు యువకులు 20 ఏళ్ల లోపువాళ్లే. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో అతివేగంతో నడిపి కన్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. తల్లిదండ్రులు మృతదేహాల వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివచ్చిన కొడుకులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడాన్ని దిగమింగుకోలేక గుండెలవిసేలా రోధించారు. 

ఇదీ చూడండి: భర్తను హత్య చేసిన కేసులో మరొకరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.