ETV Bharat / crime

ఆ తల్లిదండ్రులకు తీరని వేదన.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృతి

author img

By

Published : Apr 8, 2022, 4:46 AM IST

two children died: ప్రమాదాలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలిగొన్నాయి. అప్పటికే చెల్లితో ఆడుకుంటున్న చిన్నారి.. నాన్న ఇంటికి వచ్చాడనే ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లింది. అదే ఆమె మరణానికి కారణమైంది. తండ్రికి తీరని ఆవేదన మిగిల్చింది. మరో ఘటనలో కారు వేగంగా దూసుకువచ్చి చిన్నారిని ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారుల మృతితో వారి కుటుంబాలను విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆ తల్లిదండ్రులకు తీరని వేదన.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారుల్లో మృతి
ఆ తల్లిదండ్రులకు తీరని వేదన.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారుల్లో మృతి

two children died: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కల్టివేటర్ తగిలి చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం దర్గా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన వీరన్న.. మాధురి దంపతులకు ఇద్దరు కూతుర్లు, వీరన్న ఒకవైపు వ్యవసాయం, మరోవైపు ఫోటోగ్రఫీతో జీవనం సాగిస్తున్నారు.వీరన్న ఉదయమే మహబూబాబాద్ వెళ్లి పొలం దున్నే కల్టివేటర్​కు వెల్డింగ్ పనులు చేయించుకొని ఇంటికి వచ్చి ట్రాక్టర్​ను రివర్స్ చేస్తున్న సమయంలో.. ఇంట్లో నుంచి పెద్ద కూతురు అనన్యశ్రీ (4 ) డాడీ అనుకుంటూ బయటకు వచ్చింది. అకస్మాత్తుగా అనన్యశ్రీకి ట్రాక్టర్ కల్టివేటర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గo మధ్యలో మృతి చెందింది. తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోదనలతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్ రూరల్ ఎస్సై అరుణ్​కుమార్​ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చిన్నారిని ఢీకొట్టిన కారు.. వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. అల్వాల్​లోని వజ్ర ఎంక్లేవ్ వద్ద ఘటన జరిగింది.. కారు డ్రైవర్ వేగంగా దూసుకు రావడం మూలంగానే ప్రమాదం జరిగి ధనుష అనే చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయంలో రోడ్డుపై ఆడుకుంటున్న క్రమంలో కారు వేగంగా దూసుకు వచ్చి చిన్నారిపై నుంచి వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చిన స్థానికులు చిన్నారి తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో పడి ఉన్న దనుషను చూసి షాక్ అయ్యారు. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మహబూబ్​నగర్​కు చెందిన ధనుష తల్లిదండ్రులు వెంకటేష్ ,శోభలు బతుకుదెరువు కోసం అల్వాల్​కు వచ్చి నివాసం ఉంటున్నట్లు.. వారికి రెండు సంవత్సరాల కుమార్తె ధనుష ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. చిన్నారిని ఢీకొట్టిన కారును గుర్తించేందుకు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు సాగిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు..

ఇదీ చదవండి: murder: 'మరదలిని చంపి తానూ కూడా ఆత్మహత్య.. ఆ సంబంధమే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.