Tragedy in AP : కార్తికస్నానాల్లో విషాదం.. ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు

author img

By

Published : Nov 15, 2021, 11:52 AM IST

deaths at krishna river

కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో కార్తికమాసం(tragedy in Kartika masam) వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్నానాలకు కృష్ణా నదిలో దిగిన ముగ్గురు యువకులు(three young men went missing in Krishna river) గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కార్తికమాసం(Kartika Masam).. అదీ సోమవారం.. కుటుంబ సభ్యులతో కలిసి ఒకేఊరుకి చెందిన ముగ్గురు యువకులు కృష్ణా నది తీరాని(Krishna River Bank)కి వచ్చారు. కుటుంబ సభ్యులంతా స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తుండగా.. వీరు ముగ్గురు కూడా పుణ్యస్నానం కోసం నదిలో దిగారు. నీటిలో దిగగానే.. రెట్టింపు ఉత్సాహంతో కాసేపు కేరింతలు కొట్టారు. ఇంకాస్త ముందుకు వెళ్తే మజా వస్తుందని అనుకున్నారు. ఒకరి వెంట ఒకరు.. ముగ్గురు ఇంకొంచెం ముందుకు వెళ్లారు.

అక్కడ వారి కోసం మృత్యుదేవత కాపుకాచుకుని ఉందని గ్రహించలేకపోయారు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల నీటిలో ముగ్గురు గల్లంతయ్యారు(young men drowned in Krishna River). నదీతీరాన కార్తికదీపాలు వెలిగిస్తున్న కుటుంబ సభ్యులు గమనించేసరికి ముగ్గురు మునిగిపోయారు. అక్కడున్న వారిలో ఈత వచ్చిన వారు వారికోసం గాలించినా ఆచూకీ కానరాలేదు. ఇక చేసేదేం లేక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు(two died after drowning in Krishna river) లభించాయి. ఈ విషాద ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద జరిగింది.

తోట్లవల్లూరు గ్రామానికి చెందిన నరేంద్ర, నాగరాజు, పవన్​లు .. కార్తిక స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు కృష్ణానది పాయలోకి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గరు యువకులు గల్లంతయ్యారు(young men drowned in Krishna River). దేవుడికృప కోసం వస్తే తమ వారసులు కానరాని లోకాలకు వెళ్లారని.. ఆ యువకులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉదయంపూట ఎంతో హుషారుగా కనిపించిన తమ బిడ్డలు నిర్జీవంగా పడిఉండటం చూసి గుండెలవిసేలా రోదించారు. వారి రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవటమే ఈ విషాదానికి కారణమని గ్రామస్థులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.