Boy Kidnap: ఎంజీబీఎస్‌లో మూడేళ్ల బాలుడు అపహరణ
Updated on: May 10, 2022, 6:08 PM IST

Boy Kidnap: ఎంజీబీఎస్‌లో మూడేళ్ల బాలుడు అపహరణ
Updated on: May 10, 2022, 6:08 PM IST
17:11 May 10
ఎంజీబీఎస్‌లో బాలుడిని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి
Boy Kidnap: హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో మూడేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఫ్లాట్‌ఫాం నెంబర్ 44 వద్ద ఓ అగంతకుడు బాలుడిని అపహరించుకుపోయినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి బాలాపూర్ మండలం రంగనాయకుల కాలనీకి చెందిన లక్ష్మణ్ కూలీ పని చేస్తున్నాడు. అతను పని కోసం భార్య, కుమార్తెతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య మండలం లక్కిరెడ్డిపల్లి గ్రామానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే మూడేళ్ల కుమారుడు నవీన్‌ను హైదరాబాద్‌లోని తన బంధువుల ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. ఈ నెల 9న తిరిగి కుమారుడిని తీసుకెళ్లేందుకు బంధువుల ఇంటికి వచ్చాడు.
కుమారుడిని తీసుకుని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కేందుకు వెళ్లాడు. రైళ్లు లేకపోవడంతో బస్సులో వెళ్లేందుకు ఎంజీబీఎస్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఫ్లాట్‌ఫాం నెంబర్ 44 వద్ద బాలుడిని వదిలి... అతడు మూత్రశాలకు వెళ్లాడు. తిరిగొచ్చి చూసేసరికి కొడుకు కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తితో కలిసి బాలుడు నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:Young Girl Suicide: దంపతుల మధ్య గొడవ.. ఇద్దరి ప్రాణాలు బలి
