ETV Bharat / crime

Road Accident News: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

author img

By

Published : Oct 24, 2021, 10:58 AM IST

నాన్న బైక్ నడుపుతుండగా... ఆ అక్కాతమ్ముడు హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న చెట్లను, పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ... ప్రయాణిస్తున్న వారికి మృత్యవు తమను వెంటాడుతోందని తెలియదు. ఓ లారీ రూపంలో చావు దూసుకొచ్చింది(Road Accident News). ఆ తండ్రి, అక్కాతమ్ముడు విగతజీవులుగా మిగిలారు.

Road Accident News, road accident in bhadradri kothagudem
ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Road Accident News) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్​కు చెందిన ఆంబోజు కృష్ణ(35), అతని కుమార్తె జాహ్నవి(12), కుమారుడు అముల్ ప్రీతమ్(8) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా ధోమేడ నుంచి ద్విచక్రవాహనంపై మణుగూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

జయశంకర్ భూపాలపల్లి కేటీకే ఓసీ 3 నుంచి సారపాక ఐటీసీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ... దమ్మక్కపేట సమీపంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎదురుగా బైక్​ను అధిగమించబోయి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో(Road Accident News) రహదారిపై పడిపోయిన కృష్ణ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందారు. లారీ వెనుక టైర్లు జాహ్నవి, అముల్ ప్రీతమ్ మీద నుంచి వెళ్లాయి. బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయాలైన బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

ఈ ప్రమాదంపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పందించారు. మృతదేహాలను, గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేశారు. పినపాక నుంచి మణుగూరు వెళ్తున్న రేగా కాంతారావు... ఘటనా స్థలం వద్ద ఆగారు. అప్పుడే వచ్చిన పోలీసు జీపులోకి జాహ్నవిని ఎక్కించడానికి సాయం చేశారు. ఇద్దరి మృతదేహాలను కూడా ట్రాలీ ఆటోలో రేగా స్వయంగా ఎక్కించి పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ భానుప్రకాశ్​ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇదీ చదవండి: moral stories in telugu: అమ్మలూ మీరు ఇలాగే చేస్తున్నారా.. ఓసారి ఆలోచించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.