ETV Bharat / crime

అక్కంపల్లి జలాశయంలో పడి ముగ్గురు బీ ఫార్మసీ విద్యార్థులు మృతి

author img

By

Published : Aug 13, 2022, 6:15 PM IST

Updated : Aug 14, 2022, 6:20 AM IST

Three B Pharmacy students died falling into Akkamplali reservoir
Three B Pharmacy students died falling into Akkamplali reservoir

18:14 August 13

జలాశయంలో ఈతకు వెళ్లి నీటి మునిగి ముగ్గురు మృతి

3 B Pharmacy students died: నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది స్నేహితులు కలిసి విహారయాత్రకు నాగార్జునసాగర్ వెళ్లారు. సాగర్​లో సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్​కు వెళ్తుండగా.. మార్గమధ్యలో ఉన్న అక్కంపల్లి జలాశయానికి కూడా వెళ్లారు. అప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన స్నేహబృందపు సంతోషం.. ఎక్కువసేపు నిలువలేకపోయింది. ముగ్గురు విద్యార్థులను మృత్యువు మింగేసింది.

ఎనిమిది మంది బీ ఫార్మసీ విద్యార్థుల బృందం విహారయాత్రగా నాగార్జునసాగర్​కు వెళ్లారు. అక్కడ ఎంతో సరదాగా గడిపారు. అయితే.. స్నేహబృందంలోని కృష్ణ అనే విద్యార్థి తండ్రి గజానంద్ పుట్టంగండిలో ఉపాద్యాయుడిగా పనిచేస్తుండటంతో.. ఆయనను కలిసి వెళ్లాలనుకున్నారు. పుట్టంగండికి అక్కంపల్లి జలాశయం దగ్గరల్లోనే ఉండటం వల్ల.. ఆ ప్రాంతాన్ని కూడా చూడాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే.. కృష్ణ వాళ్ల తండ్రిని కూడా అక్కంపల్లి జలాశయానికే రమ్మన్నారు. అందరూ కలిసి జలాశయానికి చేరుకుని.. ఈత కొడుతూ సంతోషంగా గడిపారు. పిల్లలు నీటిలో సరదాగా కేరింతలు కొడుతూంటే.. ఆ దృశ్యాలను గజానంద్​ వీడియో కూడా తీశారు.

అయితే.. విద్యార్థుల బృందంలోని బిచ్కుంద‌కు చెందిన ఆకాశ్, సిరిసిల్లకు చెందిన గణేశ్​కు ఈత రాకపోవటంతో.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన స్నేహితుల బృందంలో ఒక్కసారిగా.. భయపు అలజడులు మొదలయ్యాయి. మునిగిపోతున్న స్నేహితులను కాపాడేందుకు ధైర్యం కూడగట్టుకుని కృష్ణ.. లోపలికి వెళ్లాడు. కానీ.. కన్నెర్ర చేసిన మృత్యువు.. ధైర్యంతో పాటు కృష్ణను కూడా ముంచేసింది.

అక్కడే ఉన్న కృష్ణ తండ్రి గజానంద్​.. పోలీసులు, స్థానికులకు సమాచారం ఇవ్వగా విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ.. ఫలితం లేకుండాపోయింది. పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలించగా.. ముగ్గురు విగతజీవులుగానే దొరికారు. మృతదేహాలను బయటికి తీసి.. శవపరీక్ష నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి:

Last Updated :Aug 14, 2022, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.