ETV Bharat / crime

'లోపాలను పసిగట్టి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు'

author img

By

Published : Mar 4, 2021, 3:14 AM IST

జాతీయ భద్రతకు విఘాతం కల్పించడంతోపాటు భారత టెలికాం ఖజానాకు భారీ మొత్తంలో.. గండి కొడుతున్న కేటుగాళ్లను రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. అంతర్జాతీయ ఫోన్​ కాల్స్​ను... లోకల్ కాల్స్​గా మార్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

Three arrests for detecting flaws in telecommunications and exposing massive fraud
'అంతర్జాతీయ ఫోన్​ కాల్స్​ను లోకల్​ కాల్స్​గా మార్చి..'

టెలీ కమ్యూనికేషన్​లోని లోపాలను పసిగట్టి భారీ మోసానికి తెరలేపిన ముగ్గురు కేటుగాళ్లను... రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. వారు అంతర్జాతీయ ఫోన్​ కాల్స్​ను... లోకల్ కాల్స్​గా మార్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఏసీపీ సంజయ్​ కుమార్​ వెల్లడించారు.

రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వద్ద సెల్వా టెక్నాలజీ అనే పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులు మహ్మద్ అశ్వక్, మహమ్మద్ నజీర్, షేక్ అక్బర్​లను అదుపులోకి తీసుకుని... వారి నుంచి రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: వేట కొడవలితో అన్నను నరికి చంపిన తమ్ముడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.