ETV Bharat / crime

దొంగల బీభత్సం.. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

author img

By

Published : Feb 8, 2021, 11:10 AM IST

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వెలిమినేడులో ఇండీక్యాష్​ ఏటీఎంను లూటీ చేసిన దుండగులు.. చిట్యాల ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు.

thieves-tried-to-steal-cash-from-atm-at-chityal-in-nalgonda-district
చిట్యాలలో దొంగల బీభత్సం

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అర్ధరాత్రి దొంగలు హల్​చల్ చేశారు. వట్టిమర్తి వద్ద కారు చోరీ చేసిన దొంగలు...చిట్యాల ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు. వెలిమినేడులో ఇండీక్యాష్‌ ఏటీఎంను లూఠీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 7 లక్షలు చోరీ జరిగినట్లు గుర్తించారు.

మొదట దొంగిలించిన కారులో డీజిల్‌ అయిపోవడంతో.. రహదారిపై వదిలేసి మరో కారును ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిట్యాలలో దొంగల బీభత్సం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.