ETV Bharat / crime

కన్నబిడ్డపై మూడు నెలలుగా తండ్రి అత్యాచారం

author img

By

Published : Mar 29, 2021, 7:32 AM IST

పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కని పెంచిన చేతులతోనే కాటేశాడు. సభ్యసమాజం తల దించుకునే ఈ ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

a man raped his daughter
కూతురుపై తండ్రి అత్యాచారం

ఓ తండ్రి తన కన్న కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తల దించుకునే ఈ సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది.

చింతపల్లి మండలంలోని చిన్న నర్సింహ అనే వ్యక్తి తాగుడుకు బానిసై జులయిగా తిరుగుతున్నాడు. అతడి భార్యే కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తె అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లికి బాలిక మూడు నెలల గర్భవతి అని తెలియడంతో ఆందోళనకు గురైంది. అసలు విషయం తెలుసుకుని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఓ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

ఇదీ చదంవండి: కూలర్ల​ దుకాణంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.